https://oktelugu.com/

Sundar Pichai: గూగుల్ సీఈఓకు కు ఇష్టమైన వంట ఇదే.. ఇండియాలో ఎక్కడ దొరుకుతుందంటే?

ప్రపంచ దిగ్గజాలను మరింత ఎత్తుకు నడిపిస్తున్న భారత సంతతి వ్యక్తుల్లో ఆయన ఒకరు. అతను తన ఎక్కువ సమయాన్ని యునైటెడ్ స్టేట్స్ లోనే గడిపినప్పటికీ, తన మూలాలతో మాత్రం బాగా కనెక్ట్ అవుతుంటాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 19, 2024 / 06:11 PM IST

    Sundar Pichai

    Follow us on

    Sundar Pichai: ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఎగ్జి్క్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సుందర్ పిచాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటు భాతర ప్రతిష్ఠను ప్రపంచ నలుమూలలకు చాటుతూ.. గూగుల్ ను వరల్డ్ లోనే నెం. 1 పొజిషన్ లో నిలిపేందుకు నిత్యం కృషి చేస్తున్న కృషీ వలుడు ఆయన. భారత్ కు చెందిన ఆయన ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరుగా మారారు. సుందర్ పిచాయ్ జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రపంచంలోని గొప్ప వ్యక్తులు ఇంట్రస్ట్ చూపుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

    ప్రపంచ దిగ్గజాలను మరింత ఎత్తుకు నడిపిస్తున్న భారత సంతతి వ్యక్తుల్లో ఆయన ఒకరు. అతను తన ఎక్కువ సమయాన్ని యునైటెడ్ స్టేట్స్ లోనే గడిపినప్పటికీ, తన మూలాలతో మాత్రం బాగా కనెక్ట్ అవుతుంటాడు. ఇటీవల ఒక యూట్యూబర్ వరుణ్ మయ్యాతో కలిసి పాడ్కాస్ట్ కోసం కూర్చున్న ఆయన భారత్ పై కృత్రిమ మేధ (AI) ప్రభావం, భారతీయ ఇంజినీర్లకు ఇచ్చిన సలహాలతో సహా పలు అంశాలపై చర్చించారు. పాడ్కాస్ట్ ముగింపు సందర్భంగా పిచాయ్ తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి వెల్లడించారు.

    పాడ్కాస్ట్ సమయంలో, భారతదేశంలో మీకు ఇష్టమైన ఆహారం ఏంటని సుందర్ పిచాయ్ ను మయ్యా అడిగినప్పుడు.. గూగుల్ సీఈవో చాలా దౌత్యపరమైన సమాధానం ఇచ్చారు. దేశంలోని మూడు మెట్రోపాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి తనకు ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకున్నాడు. బెంగళూరు నుంచి దోశ, ఢిల్లీకి చెందిన చోలే భతురే, ముంబైకి చెందిన పావ్ బాజీలను ఇష్టపడతానని వెల్లడించాడు. ‘బెంగళూరు వచ్చినప్పుడు నాకు దోశ దొరుకుతుంది. ఇది నా ఫేవరెట్ ఫుడ్. అది ఢిల్లీ అయితే చోళ భతురే. ముంబై అయితే పావ్ బాజీ తింటాను’ అని సుందర్ పిచాయ్ వరుణ్ మయ్యాతో అన్నారు.

    తనకు ఇష్టమైన భారతీయ వంటకం గురించి మాట్లాడటమే కాకుండా, ఫాంగ్ (ఫేస్బుక్, ఆపిల్, అమెజాన్, నెట్ ప్లిక్స్ అండ్ గూగుల్) ఇంటర్వ్యూలలో విజయం సాధించడంలో యువతకు సాయం చేసేందుకు అంకితమైన దేశంలోని మొత్తం పరిశ్రమ గురించి అడిగినప్పుడు పిచాయ్ ‘బట్టి పట్టడం’ అంశాన్ని ప్రస్తావించారు. అమీర్ ఖాన్ నటించిన ‘3 ఇడియట్స్’లోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ అభ్యర్థులు విషయాలను లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

    ‘3 ఇడియట్స్’ సినిమా లేదా మరేదైనా సినిమాకు వెళ్లాలనిపించింది. అలాగే, అక్కడ వారు అమీర్ ఖాన్ ను మోటారు యొక్క నిర్వచనం గురించి అడిగే సన్నివేశం ఉంది. మోటారు అంటే ఏమిటో వివరించే వెర్షన్ ఉంది. మోటారు అంటే ఏమిటో అర్థం చేసుకునే వెర్షన్ ఉంది’ అని ఆయన అన్నారు.

    సుందర్ పిచాయ్ భారత సంతతికి చెందిన గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ కావడం భారతీయులు గర్వించతగిన అంశం. 1972లో తమిళనాడులోని మధురైలో జన్మించిన ఆయన 1989లో ఐఐటీ ఖరగ్‌పూర్ లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదివారు.

    ఆ తర్వాత చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్న సుందర్ పిచాయ్ వరల్డ్ నెం. 1 టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కు సీఈవోగా నియమితుడయ్యారు. ఆయనను చూసి భారతీయ యంగ్ జనరేషన్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పొగడ్తలతో ముంచెత్తారు.