https://oktelugu.com/

Naresh Pavitra Lokesh: లేటు వయసులో పవిత్ర లోకేష్ ని నరేష్ పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదా… కీలక విషయం వెలుగులోకి!

రమ్య రఘుపతితో విడాకులు విషయంలో వివాదం కొనసాగుతోంది. అయితే పవిత్ర లోకేష్ తో నరేష్ కు ఇంతలా ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటానికి గల కారణాలు ఆయన బయటపెట్టారు.

Written By: , Updated On : May 19, 2024 / 06:18 PM IST
Naresh Pavitra Lokesh

Naresh Pavitra Lokesh

Follow us on

Naresh Pavitra Lokesh: విజయనిర్మల కొడుకు నరేష్ నటి పవిత్ర లోకేష్ తో ప్రేమ వ్యవహారం అప్పట్లో సోషల్ మీడియాని షేక్ చేసింది. అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్, నాలుగు పెళ్ళికి సిద్ధం అయ్యాడు. పవిత్ర లోకేష్ తో నరేష్ ప్రేమలో పడ్డారు. దాదాపు ఏడేళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారని సమాచారం. కానీ క్లారిటీ లేదు. ఒకవేళ అన్ అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నప్పటికీ అఫీషియల్ గా ప్రకటించలేరు. ఎందుకంటే ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి ఇంకా విడాకులు ఇవ్వలేదు.

రమ్య రఘుపతితో విడాకులు విషయంలో వివాదం కొనసాగుతోంది. అయితే పవిత్ర లోకేష్ తో నరేష్ కు ఇంతలా ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటానికి గల కారణాలు ఆయన బయటపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవిత్ర తో ప్రేమలో పడటానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందని వెల్లడించారు. నరేష్ మాట్లాడుతూ .. మా అమ్మ విజయ నిర్మల పుట్టిన రోజు .. పవిత్ర పుట్టిన రోజు ఒకటే. ఇద్దరి బర్త్ డే ఫిబ్రవరి 20నే. ప్రకృతి ఆ విధంగా సిగ్నల్ పంపింది.

అత్తాకోడళ్ల పుట్టిన రోజులు కలవడం చాలా అరుదు. ఆ మిరాకిల్ నా లైఫ్ లో జరిగింది. మా అమ్మ ఎప్పుడూ అంటుండేది. నీకు అన్నిఇచ్చాను రా .. కానీ మంచి పార్ట్నర్ ని ఇవ్వలేకపోయాను అని బాధపడేది. పవిత్ర లోకేష్ నా లైఫ్ కి వచ్చిన తర్వాత మా అమ్మకి ఒక మాట చెప్పాను. అప్పుడు ఆమె తన చివరి దశలో బెడ్ పై ఉన్నారు. నా పార్ట్నర్ గురించి నువ్వు దిగులు పడకు. మంచి వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చింది.

నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నాను. పవిత్ర కూడా మా అమ్మ లాగే చాలా మంచి వ్యక్తి. స్ట్రాంగ్ ఉమెన్ అంటూ నరేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. పవిత్ర లోకేష్ సైతం నటిగా కొనసాగుతుంది. నరేష్-పవిత్ర లోకేష్ జంటగా మళ్ళీ పెళ్లి టైటిల్ తో ఒక మూవీ చేసిన సంగతి తెలిసిందే.