https://oktelugu.com/

కేసీఆర్‌‌ వరాల వెనుక అసలు కుట్ర అది..: విజయశాంతి ఫైర్‌‌

మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉండి.. ఇప్పుడు సొంత గూడు బీజేపీలోకి వచ్చి చేరిన విజయశాంతి అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై విరుచుకుపడుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ ఓటమి అయోమయంలో కేసుల భయంతో చివరికి ప్రజలను బెదిరించే స్థాయిలో వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ లో వచ్చిన మార్పుకు కారణం చెప్పారు. రాత్రికి రాత్రి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోందంటూ సెటైర్లు వేశారు. Also Read: పేదల నుంచి […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 31, 2020 / 02:22 PM IST
    Follow us on


    మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉండి.. ఇప్పుడు సొంత గూడు బీజేపీలోకి వచ్చి చేరిన విజయశాంతి అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై విరుచుకుపడుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ ఓటమి అయోమయంలో కేసుల భయంతో చివరికి ప్రజలను బెదిరించే స్థాయిలో వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ లో వచ్చిన మార్పుకు కారణం చెప్పారు. రాత్రికి రాత్రి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోందంటూ సెటైర్లు వేశారు.

    Also Read: పేదల నుంచి ఆ మాటే రావద్దు.. : అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

    సీఎం కేసీఆర్‌‌ ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల పట్ల పాజిటివ్‌గానే ఉన్నాయి. కానీ.. ఇన్నేండ్లలో ఒక్కసారైనా లేని ఈ ఆలోచనలు ఇప్పుడే ఎందుకు కేసీఆర్‌‌లో వచ్చాయనేది ప్రశ్న. సరిగా విజయశాంతి కూడా వాటి మీదనే హాట్‌ కామెంట్స్‌ చేశారు. సీఎం కేసీఆర్ కురిపిస్తున్న వరాల జల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరిలో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై అనడం, ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గడం.. ఇలా గత నాలుగైదు రోజులుగా కేసీఆర్ చేస్తున్న ప్రకటనల మర్మమేంటో ఎవరికీ తెలియదనుకుంటే పొరపాటని ఆమె వ్యాఖ్యానించారు.

    కేసీఆర్‌‌ కురిపిస్తున్న వరాల జల్లులను ప్రజలు అర్థం చేసుకోగలరని.. గడచిన టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోకుండా ఇప్పుడు ఒక్కసారిగా దృష్టి సారిస్తుండటం వెనుక కుట్ర కాక సంక్షేమం ఉందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లేవన్నారు. ఇదే సమయంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ప్రభుత్వ అధినేత అహంకారాన్ని కొంత దారికి తెచ్చినట్లు అనిపిస్తుందని కూడా వ్యాఖ్యానించారు.

    Also Read: న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఆగ్రహం..!

    భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ ఈ తరహా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, రాబోయే ఉపఎన్నికల్లోనూ వస్తే ఎలా అన్న ఆలోచనలోనే ఈ నిర్ణయాలకు కారణాలని అభిప్రాయపడ్డారు. అందుకే సీఎం గారు ఎంతో కొంత జన సంక్షేమం గురించి కనీసం ఆలోచించేలా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్