పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..?

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్ ను కలిగి ఉన్న సంగతి తెలీసిందే. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో పీఎఫ్ ఖాతాల్లోని నగదుకు 8.5 శాతం వడ్డీ ఇస్తుండగా ఆ మొత్తం నేడు జమ కానుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్‌ లో 2019 – 2020 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ చెల్లించాలని […]

Written By: Kusuma Aggunna, Updated On : December 31, 2020 2:24 pm
Follow us on


దేశంలో కోట్ల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్ ను కలిగి ఉన్న సంగతి తెలీసిందే. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో పీఎఫ్ ఖాతాల్లోని నగదుకు 8.5 శాతం వడ్డీ ఇస్తుండగా ఆ మొత్తం నేడు జమ కానుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్‌ లో 2019 – 2020 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..!

అయితే వడ్డీ శాతం 8.5 శాతం అయినా పీఎఫ్ సబ్‌స్క్రైబర్ల అకౌంట్లలో రెండు విడతల్లో నగదు జమ కానుంది. తొలి విడతలో భాగంగా 8.5 శాతం వడ్డీ నేడు పీఎఫ్ సబ్ స్క్రైబర్ల ఖాతాల్లో జమ కానుండగా రెండో విడతలో 0.35 శాతం వడ్డీ జమ చేయాలని గతంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఖాతాల్లోకి నగదు జమ కానుండగా ఏకంగా 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం కలగనుందని సమాచారం.

Also Read: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఓవర్ టైమ్ చేస్తే డబుల్ జీతం..?

అయితే ఈపీఎఫ్‌వో రెండు విడతల్లో కాకుండా ఒకే విడతలో 8.5 శాతం వడ్డీతో చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నేడు నేడు 8.5 శాతంతో నగదు జమ కానుంది. ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్ ను కలిగి ఉండటం వల్ల సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. డబ్బులు రెగ్యులర్ గా కంట్రిబ్యూట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో ఊహించని స్థాయిలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం: విద్య / ఉద్యోగాలు

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులు పీఎఫ్ ఖాతా ద్వారా రిటైర్మెంట్ తర్వాత లైఫ్ లాంగ్ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ కు ప్రస్తుఅం 8.5 శాతం వడ్డీ లభిస్తుండగా ఈ స్థాయిలో వడ్డీ రేటు ఇతర స్కీమ్ ల ద్వారా పొందడం సాధ్యం కాదు. ఉద్యోగం పోయినా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పీఎఫ్ అకౌంట్ ద్వారా డబ్బులను విత్ డ్రా చేసుకోవడం సాధ్యమవుతుంది.