TG Venkatesh: టీజీ మళ్లీ పార్టీ మారడం ఖాయం..?

TG Venkatesh: రాయలసీమ నేత టీజీ వెంకటేశ్. ఆయన రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. పలు పార్టీలు మారారు. రాజకీయాల్లో తనకంటూ ఓ సుస్థిర స్తానం సంపాదించుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికే జై కొడతారు. తమ కోరికలు తీర్చుకునే క్రమంలో ఎలాంటి నిర్ణయానికైనా వెనుకాడరు. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నేతగా ఉన్నా టీడీపీలో చేరి కొడుకుకు టికెట్ ఇప్పించుకున్నా బీజేపీలో చేరి పరిస్థితులకు అనుగుణంగా మారిపోయారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా […]

Written By: Srinivas, Updated On : January 15, 2022 2:24 pm
Follow us on

TG Venkatesh: రాయలసీమ నేత టీజీ వెంకటేశ్. ఆయన రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. పలు పార్టీలు మారారు. రాజకీయాల్లో తనకంటూ ఓ సుస్థిర స్తానం సంపాదించుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికే జై కొడతారు. తమ కోరికలు తీర్చుకునే క్రమంలో ఎలాంటి నిర్ణయానికైనా వెనుకాడరు. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నేతగా ఉన్నా టీడీపీలో చేరి కొడుకుకు టికెట్ ఇప్పించుకున్నా బీజేపీలో చేరి పరిస్థితులకు అనుగుణంగా మారిపోయారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనా ఆయనకే చెల్లు.

2014లో టీడీపీలో చేరిన వెంకటేశ్ కొడుకుకు కర్నూలు టికెట్ ఇప్పించుకున్నారు. కానీ గెలిపించుకోలేకపోయారు. దీంతో ఈసారి కూడా కర్నూలు టికెట్ తన కుమారుడికే అని తెలిసిపోతోంది. దీంతో ఈసారైనా గట్టిగా ప్రచారం చేసుకుని కొడుకును శాసనసభకు పంపాలని భావిస్తున్నారు. ఆర్యవైశ్య నేతగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన వెంకటేశ్ కు ఇప్పుడు పొత్తుల వ్యవహారం ఓ తలనొప్పిగా మారే అవకాశం ఏర్పడింది. దీంతో ఎలా వ్యవహరించాలనే దానిపైనే మళ్లగుల్లాలు పడుతున్నారు.

Also Read:  ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పిల్లలపై ఎంతంటే? 

రాష్ర్టంలో ప్రస్తుతం పొత్తులపైనే చర్చ నడుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతుండగా టీడీపీ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. దీంతో టీడీపీ బీజేపీ కలిస్తే వెంకటేశ్ కు కలిసొచ్చే అంశమే. ఎందుకంటే ఆయన బీజేపీలో ఉండటంతో టీడీపీతో పొత్తు ఉంటే కొడుకు కోసం ప్రచారం చేసుకోవచ్చనే ఆశ ఆయనలో మెదులుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ టీడీపీ పొత్తుపై ఆయన భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

అయితే 2019 ఎన్నికల తరువాత బీజేపీలో చేరారు. దీంతో కొడుకు భరత్ ను ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంలో వెంకటేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసమే ఆయన పొత్తులపై దృష్టి సారించారు. ఎలాగూ టీడీపీ బీజేపీ పొత్తు ఉంటే ఇక తనకు తిరుగు ఉండదనే ఆలోచనలో నిమగ్నమయ్యారు. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయో? ఎన్నికల వరకు ఎవరెవరి నిర్ణయాలు ఏ విధంగా మారతాయో తెలియదు. అందుకే ఆయన పొత్తుల విషయంలో గందరగోళంలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. తన కొడుకు భవిష్యత్ కోసం అహర్నిశలు ఆలోచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీజీ వెంకటేశ్ తన రాజకీయ భవిష్యత్ పై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ బలం ఎంత? రాష్ర్టంలో పొత్తులు లేకపోతే ఎలా? అనే మీమాంసలో పడ్డారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న వెంకటేశ్ కు ప్రస్తుతం భవిష్యత్ ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నట్లుంది. అందుకే ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాయలసీమలో తిరుగులేని నేతగా ఉన్న వెంకటేశ్ ప్రస్థానం ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. కొడుకు భవిష్యత్ దృష్ట్యా ఆయన మరోసారి పార్టీ మారతారో ఏమోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

Also Read: డ్యూడ్.. రైతులపై ప్రేమ.. ప్రభాస్ డైలాగ్ తో కొట్టిన తెలంగాణ మంత్రి

Tags