https://oktelugu.com/

UP Election 2022: యూపీలో బీజేపీకి వరుస షాక్‌లు.. ఈసారి గెలుపు కష్టమేనా?

UP Election 2022: ఉత్తరప్రదేశ్‌లో ఈ సారి కూడా తామే అధికారంలోకి వస్తామని కమలనాథులు ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, కాబట్టి ప్రజలంతా తమ వైపున ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తారు. కాగా, ఇటీవల కాలంలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు. అలా రాజీనామాల పరంపర కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లో చేరి బీజేపీపైన తీవ్రమైన ఆరోపణలు […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 15, 2022 2:18 pm

    UP Elections

    Follow us on

    UP Election 2022: ఉత్తరప్రదేశ్‌లో ఈ సారి కూడా తామే అధికారంలోకి వస్తామని కమలనాథులు ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, కాబట్టి ప్రజలంతా తమ వైపున ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తారు. కాగా, ఇటీవల కాలంలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు. అలా రాజీనామాల పరంపర కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లో చేరి బీజేపీపైన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

    UP Election 2022

    బీజేపీ సర్కారులో రైతులు, వెనుకబడిన వర్గాలకు ప్రయారిటీ లేదని, వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అంటున్నారు. అలా స్వామి ప్రసాద్ మౌర్య, ధర్మ్ సింగ్ సైనీలతో మొదలు పెట్టి, దారాసింగ్ చౌహాన్, ముకేశ్ వర్మ తదితరులు బీజేపీకి రాజీనామా చేశారు. ఇంకా పలువురు నేతలు రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీని వీడబోయే నేతలందరూ సమాజ్ వాదీ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇకపోతే తమ పార్టీలోకి వచ్చే వారందరికీ వెల్ కమ్ చెప్తున్నామని, త్వరలో చాలా మంది అధికార పార్టీ నేతలు తమ పార్టీలోకి వస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి అబ్దుల్ హఫీజ్ గాంధీ ప్రకటించారు.

    అలా బీజేపీకి మొత్తంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా ఉన్నదని కొందరు నేతలు చేసే ఆరోపణలు ఎన్నికల్లో ప్రభావం చూపే చాన్సెస్ మెండుగా ఉంటాయని అంటున్నారు. బీజేపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారులో అగ్రవర్ణాలకే ప్రయారిటీ ఉందనే వాదన కూడా కొందు చేస్తున్నారు.

    అయితే, బీజేపీ మాత్రం అవన్నీ ఉట్టి ఆరోపణలేనని అంటోంది. తమ పార్టీలోకి సైతం ఎస్పీ నుంచి వలసలు ఉంటాయని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి తెలిపారు. అలా మొత్తంగా బీజేపీ, ఎస్పీల నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీల్లోకి వెళ్తున్నారు. చూడాలి మరి.. ఈ సారి యూపీ ఓటర్లు ఎవరికి అధికారం ఇస్తారో..

    Tags