వైసీపీలో టెన్షన్..టీడీపీలో కూల్: తిరుపతి ఫలితంపై ఉత్కంఠ..

తిరుపతి ఉప ఎన్నిక ఫలితంపై టెన్షన్ ఎవరికుండాలి..? అయితే అభ్యర్థులకు.. లేదా గెలుస్తామా..? లేదా..? అని ప్రతిపక్షాలకు. కానీ తిరుపతి ఫలితంపై ఇక్కడ అధికార పార్టీకి చెందిన నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. రిజల్ట్ విషయం పక్కనబెట్టి మరో విషయంపై తర్జనభర్జన పడుతున్నారట. అధికార పార్టీ నాయకులు ఇలా మధనపడుతుంటే.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం చాలా కూల్ గా ఉందట. ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా తన పని తాను చేసుకుంటోందట. ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి..? […]

Written By: NARESH, Updated On : April 30, 2021 12:38 pm
Follow us on

తిరుపతి ఉప ఎన్నిక ఫలితంపై టెన్షన్ ఎవరికుండాలి..? అయితే అభ్యర్థులకు.. లేదా గెలుస్తామా..? లేదా..? అని ప్రతిపక్షాలకు. కానీ తిరుపతి ఫలితంపై ఇక్కడ అధికార పార్టీకి చెందిన నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. రిజల్ట్ విషయం పక్కనబెట్టి మరో విషయంపై తర్జనభర్జన పడుతున్నారట. అధికార పార్టీ నాయకులు ఇలా మధనపడుతుంటే.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం చాలా కూల్ గా ఉందట. ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా తన పని తాను చేసుకుంటోందట. ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి..? అసలు విషయం ఏంటి..?

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై ఆ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులు టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ ఎలాగూ వస్తుందని, అయితే మెజారిటీ విషయంలో మాత్రం పార్టీ అధినేత పెట్టిన టార్గెట్ రీచ్ అవుతామా..? లేదా..? అన్నసందేహంలో ఉన్నారట. అభ్యర్థి గురుమూర్తి కూడా ఎలాంటి టెన్షన్ తీసుకోవడం లేదు. ఈ ఎన్నికకు ముందు ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమైన జగన్ ఇక్కడ 5 లక్షల మెజారిటీ తీసుకురావాలని చెప్పాడట. ఎందుకంటే పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీలు మొత్తం వైసీపీవే ఉన్నాయి. దీంతో గెలుపు ఎలాగూ ఉంటుందని, మెజారిటీ విషయంలో కష్టపడి 5 లక్షలు తీసుకొచ్చి చరిత్ర సృష్టించాలని జగన్ ఆదేశించారట.

అయితే పోలింగ్ సరళిని భట్టి చూస్తే అది సాధ్యం కాదన్నట్లు కనిపిస్తోంది. పైగా ఫలితంపై బీజేపీ నాయకులు కోర్టు మెట్లెక్కారు. దీంతో విచారణ జరిపితే ఫలితంపై స్టే ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మెజారిటీ విషయంలో చాలా మదనపడుతున్నారట. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఎలాంటి టెన్షన్ తీసుకోవడం లేదట. టీడీపీ తరుపున పోటీచేసిన పనబాక లక్ష్మి మినహాయించి ఇతర నాయకులు తిరుపతి ఫలితాన్ని పట్టించుకోవడం లేదని చర్చించుకుంటున్నారు.

ఎందుకంటే ఇక్కడ ఎలాగూ ఓడిపోతామనే ధీమాలోనే ఉన్నారట. అంతేకాకుండా హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే స్టే వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఫలితం వచ్చినా.. రాకపోయినా ఒరిగేదేమీ లేదని అనుకుంటున్నారట. అయితే వైసీపీ నాయకులు మాత్రం వారు టార్గెట్ రీచ్ చేసి జగన్ దగ్గర మెప్పు పొందుతారా..? లేదా..? చూద్దాం..