ఎంపీ రఘురామలో టెన్షన్..

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజులో భయం పుట్టుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. దీంతో రఘురామ మాట్లాడుతూ తనమీద అనర్హత వేటు వేయటం అంత ఈజీ కాదని బుకాయించారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సమర్థించుకుంటున్నారు. స్పీకర్ ను కలిసి తనపై […]

Written By: Srinivas, Updated On : June 16, 2021 6:11 pm
Follow us on

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజులో భయం పుట్టుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. దీంతో రఘురామ మాట్లాడుతూ తనమీద అనర్హత వేటు వేయటం అంత ఈజీ కాదని బుకాయించారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సమర్థించుకుంటున్నారు. స్పీకర్ ను కలిసి తనపై అనర్హత వేటు వేయొద్దని కోరటం ప్రాధాన్యత సంతరించుకుంది.
వైఎస్సార్ సీపీ జగన్ ది కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ కు రఘురామ ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ తనదే అంటూ అన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఎన్నికల కమిసన్ కు ఢిల్లీ కోర్టులో కేసు వేశారు. అప్పుడు రఘురామ బాషాకు మద్దతు పలికారు. దీంతో రఘురామ కృష్ణంరాజులో భయం పెరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తనపై ఎక్కడ అనర్హత వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ కేసు వేశారు. జగన్ మీదున్న కేసులకు ఎంపీకి సంబంధం లేకపోయినా కోర్టులో కేసు వేయాల్సి ఎందుకొచ్చిందని పలువులు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీ జగన్ ది కాదని పలు మార్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జగన్ వేరు పార్టీ వేరని పలుమార్లు రచ్చకెక్కారు. దీంతో రఘురామపై వైసీపీ నేతలందరికి కోపమే ఉంటోంది.
జగన్ కు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే పోరాడవచ్చు. కానీ పార్టీకి ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేసి కదలాల్సిన అవసరం గుర్తించాలి. కానీ రఘురామ ఇవేమీ చేయకుండా వైసీపీ టికెట్ నుంచి గెలిచి దాని ప్రతిష్ట దెబ్బతీయడానికే నడుం కట్టడంతో పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రఘురామపై వేటు వేయాల్సిందేనని కోరుతున్నాయి.