అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ సినిమా ఎప్పుడో పూర్తయింది. అందుకే, ఈ సినిమాని ఏప్రిల్ 16న థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాని మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నాయి కాబట్టి, ఈ నెల చివరి నుంచి తెలుగు రాష్ట్రాల్లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ అవుతాయని అంటున్నారు.
దాంతో ఈ సినిమా విడుదల విషయంలో మళ్ళీ పుకారు మొదలైంది. జులై ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతుందనే వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇస్తూ.. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది. అయితే, థియేటర్లలో రోజుకు 3 ప్రదర్శనలకు మాత్రమే వేసుకోవాలి అనే కండిషన్ పెడితే మాత్రం మా సినిమాని రిలీజ్ చేయము.
అందుకే, ప్రస్తుతానికి లవ్ స్టోరీ రిలీజ్ పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తాము. అందరూ అంటున్నట్టు, జులై ఫస్ట్ వీక్ లో రిలీజ్ కాకపోవచ్చు. జులై రెండవ వారం తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి అనిపిస్తుంది. కాబట్టి, ఈ చిత్రం విడుదల తేదీ జులై మూడో వారంలో ఉండే అవకాశం ఉంది. మా టీమ్ తో చర్చించిన తరువాత రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాము’ అంటూ నిర్మాత సునీల్ నారంగ్ చెప్పుకొచ్చాడు.
డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. ఇక శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకుడు కావడం మరో ప్రత్యేకత. అన్నట్టు శేఖర్ కమ్ముల గత సినిమాలు కంటే కూడా ఈ సినిమా చాలా బాగా ఉంటుందట.