https://oktelugu.com/

100 మంది పోలీసులు.. రాజాసింగ్ ఇంటి వద్ద టెన్షన్

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తెలంగాణలోని బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన నియోజకవర్గంలో వరద సాయం అందలేదని.. ప్రజలు, నాయకులు పోటెత్తారు. రాజాసింగ్ ఇంటిని ముట్టడించేందుకు రెడీ అయ్యారు. అసలే రాజాసింగ్ కు ఇప్పటికే టెర్రరిస్టుల నుంచి ముప్పుపొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే ఆయనకు పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజలు, కాంగ్రెస్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.అక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 8:07 pm
    Follow us on

    Raja Singh

    వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తెలంగాణలోని బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన నియోజకవర్గంలో వరద సాయం అందలేదని.. ప్రజలు, నాయకులు పోటెత్తారు. రాజాసింగ్ ఇంటిని ముట్టడించేందుకు రెడీ అయ్యారు. అసలే రాజాసింగ్ కు ఇప్పటికే టెర్రరిస్టుల నుంచి ముప్పుపొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే ఆయనకు పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజలు, కాంగ్రెస్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.అక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    అయితే రాజాసింగ్ మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం వరదల సాయంలో విఫలమైందని ఆరోపించారు. ప్రకటించిన రూ.10వేల సాయాన్ని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు పంపుతున్నారని ఆరోపించారు. కొందరు కావాలనే నాపై బురద జల్లడానికి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

    Also Read: వైరల్: ఆరోజుల్లో.. కేటీఆర్ పాత జ్ఞాపకం..

    హైదరాబాద్ లోని గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడం లేదని .. వరద సాయం తన వర్గం వారికి ఇప్పించుకున్నారని గోషామహల్ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు రాజాసింగ్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు.

    Also Read: కేసీఆర్ రంగంలోకి.. ఏం జరుగనుంది?

    కాంగ్రెస్ నాయకులు రాజాసింగ్ ఇంటి ముట్టడికి ప్రజా నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. దాదాపు 100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.