కుక్కతోక వంకర అన్నట్టు డ్రాగన్ బుద్ది మారడం లేదు. ఇది వరకు జరిగిన ఘర్షణలో భారత సైనికులు 21 మంది.. చైనా సైనికులు 40కు పైగానే చనిపోయినా చైనా దుస్సాహసం మాత్రం ఆగడం లేదు.తాజాగా తూర్పు లఢక్ లో సరిహద్దులను చైనా సైనికులు మళ్లీ ఉల్లంఘించినట్టు భారత ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించారని.. భారత సైనికులు వారిని అదుపు చేశారని పేర్కొంది.
Also Read: ప్రణబ్ ఎలా చనిపోయాడు? అలా ఎందుకు జరుగుతుంది?
తాజాగా వివాదం మళ్లీ ప్యాంగాంగ్ సరస్సు సమీపంలోనే చోటుచేసుకుంది. అక్కడే చైనా సైనికుల కవ్వింపు చర్యలను భారత సేనలు అడ్డుకున్నాయి. చర్చలు జరిపాయి. కానీ అవి ఫలించలేదు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగితే సహించేది లేదని భారత సైన్యం తెలిపింది. ప్రస్తుతం చుషుల్ లో బ్రిగేడియర్ కమాండర్ స్థాయిలో చర్చలు జరుపుతోంది.
ఆగస్టు 29న రాత్రి ఈ కవ్వింపు చర్యలు చైనా సైనికులు చేసినట్లు భారతసైన్యం తెలిపింది. సరిహద్దుల్లో పరిస్థితులను తారుమారు చేసేందుకు భారీగా వస్తు సామగ్రి తెచ్చి రోడ్లు, రవాణా చర్యలు చేపట్టేందుకు చైనా సైన్యం ప్రయత్నించిందని పేర్కొంది. అయితే భారత సైనికులు అడ్డుకున్నట్లు సమాచారం.
జూన్ 15న లఢక్ లోని గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలో ఇరువైపులా ప్రాణ నష్టం చోటుచేసుకుంది. అప్పటి నుంచి రెండు దేశాల సైనికుల మధ్య ప్రాణనష్టం చోటుచేసుకుంటోంది. ఇప్పటికీ పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి.
Also Read: రాజకీయ భీష్ముడు ‘ప్రణబ్’ గురించి ఆసక్తికర విశేషాలు
భారత్ సరిహద్దుల్లో తాజా ఘర్షణపై చైనా స్పందించింది. చైనా సరిహద్దు బలగాలు వాస్తవాధీన రేఖను ఖచ్చితంగా పాటించాయని.. ఎన్నడూ ఆ రేఖను దాటలేదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియాతో చెప్పారు. సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు.
కాగా దక్షిణ చైనా సముద్రంలో భారత యుద్ధనౌకలను మోహరించడంతో ప్రతీకారంగానే చైనా తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లోకి ఎగదోస్తోందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Fresh #China– #India border clash? Chinese FM on Monday said Chinese border troops have always strictly observed the Line of Actual Control and have never crossed the line. The border troops of the two countries have been in communication over territory issues. pic.twitter.com/bZIB9lOb3Z
— Global Times (@globaltimesnews) August 31, 2020