https://oktelugu.com/

ప్రణబ్ ఎలా చనిపోయాడు? అలా ఎందుకు జరుగుతుంది?

రాజకీయ కురువృద్ధుడు, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెల్సిందే. ఇటీవల ప్రణబ్ అనారోగ్యానికి గురికాగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే ఆయనకు కోవిడ్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్ తేలింది. ఆర్మీ ఆస్పత్రిలోనే ఆయనకు బ్రెయిన్ ఏర్పడిన బ్లడ్ క్లాట్ కు శస్త్రచికిత్స చేశారు. కొద్దిరోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్న ప్రణబ్ ఆరోగ్యం క్రమంగా క్షిణించడంతో కోమాలోకి వెళ్లారు. Also Read: కరోనాకు.. మగవాళ్లకు ఉన్న లింకేటీ? దీంతో ఆయనకు వెంటిలేటర్ పై […]

Written By:
  • NARESH
  • , Updated On : September 1, 2020 / 10:53 AM IST
    Follow us on

    రాజకీయ కురువృద్ధుడు, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెల్సిందే. ఇటీవల ప్రణబ్ అనారోగ్యానికి గురికాగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే ఆయనకు కోవిడ్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్ తేలింది. ఆర్మీ ఆస్పత్రిలోనే ఆయనకు బ్రెయిన్ ఏర్పడిన బ్లడ్ క్లాట్ కు శస్త్రచికిత్స చేశారు. కొద్దిరోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్న ప్రణబ్ ఆరోగ్యం క్రమంగా క్షిణించడంతో కోమాలోకి వెళ్లారు.

    Also Read: కరోనాకు.. మగవాళ్లకు ఉన్న లింకేటీ?

    దీంతో ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తుండగా సోమవారం సాయంత్రం మృతిచెందినట్లు ప్రణబ్ కుమారుడు ట్వీటర్లో వెల్లడించారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితర ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ బ్లడ్ క్లాట్ మృతిచెందడంతో అసలు ఇది ఎలా వస్తుంది? ఇది రాకుండా ఎలా చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

    *బ్లడ్ క్లాట్ ఎవరికీ వస్తుంది?
    బ్లడ్ క్లాట్(బ్రెయిన్ ఎటాక్) అనేది 65ఏళ్లు పైబడిన వారికి ఎక్కవగా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ వచ్చి ఉన్నా.. హృదయ సంబంధ రోగాలున్నా.. బ్లడ్ థిన్నింగ్ కోసం మెడిసిన్స్ వాడుతున్నా.. అధిక బరువు కలిగి ఉన్నా.. డయాబెటీస్, బ్రెయిన్ ట్యూమర్స్, మైగ్రేన్స్ సమస్యలు ఉన్నవారికి.. పొగ, మద్యం అలవాటు ఉన్నవారికి, రెగ్యులర్ గా వ్యాయామం చేయకపోయనా.. బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకునే వారిలో ఎక్కువగా ఈ బ్లడ్ క్లాట్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    *ఇది రాకుండా ఉండాలంటే.?
    తొలుత హైబీపీ ఉన్నవారు దానిని అదుపులో పెట్టుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. బరువును కంట్రోల్లో ఉంచుకోవాలి. పోగ, మద్యం సేవించడం మానేయాలి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ పదార్థాలను తగ్గించుకోవాలి. డ్రగ్స్ ని పూర్తిగా తగ్గించాలి. రోజులో కనీసం 30నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. ఆహారం లో ఫైబర్ ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి.

    Also Read: మోడీకి నెటిజన్ల సెగ.. బాగానే తగిలింది

    *ముందే గుర్తించవచ్చా?
    ఈ స్ట్రోక్ రావడానికి ముందు శరీరం కొన్ని సిగ్నల్స్‌ని అందజేస్తుంది. ఉన్నట్టుండి సరిగ్గా కనపడటం మానేస్తుంది. ప్రతీదీ రెండుగా కనపడొచ్చు. ఇది ఒక కంటికి కానీ లేదా రెండు కళ్ళకి కానీ జరిగే అవకాశం ఉంది. సరిగ్గా మాట్లాడలేరు. ఆహారం, నీళ్లు మింగలేకపోవడం బ్లడ్ క్లాట్ వచ్చిందని సిగ్నల్ అన్నమాట. దీంతోపాటు హఠాత్తుగా బాగా తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతి వస్తున్నట్లు అనిపించడం, శరీరంలో ఒకవైపు తిమ్మిరెక్కడం, ముఖం, కాళ్లు, చేతులకు పక్షవాతం వచ్చినట్లుగా అనిపించడం, చేతులు పైకెత్త లేకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం బ్లడ్ కాట్ లక్షణాలు. వీటిని త్వరగా గుర్తించి వెంటనే సరైన వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.