Cold Wave: తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. శీతల గాలుల వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏడు తరువాత కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వణుకుతున్నారు. వివిధ పనుల కోసం బయటకు వెళ్లే వారు వేడి దుస్తులు ధరించేందుకు సిద్ధమవుతున్నారు. చలి నుంచి రక్షించుకునేందుకు స్వెటర్లు, మఫ్లర్లు వేసుకుంటున్నారు.
గత రెండు మూడు రోజుల నుంచి చలి ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు సాయంత్రం నుంచి ఉదయం వరకు బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఫలితంగా చలి తీవ్రతను తట్టుకునేందుకు చలి మంటలు కూడా వేసుకుంటున్నారు. అయినా చలి మాత్రం తగ్గడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చలి నుంచి రక్షించుకునేందుకు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో అత్యల్పంగా 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉదయం పూట బయటకు రావాలంటే రక్షణగా స్వెట్లర్లు, మఫ్లర్లు కట్టుకుంటేనే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. దీంతో తెల్లవారు జామున నగరం చుట్టుపక్కల 8.5 నుంచి 13 డిగ్రీల వరకు చలి తీవ్రత ఉంటోంది. భూ వాతావరణం చల్లబడినప్పుడే ఇలా రాత్రి, పగళ్లలో వ్యత్యాసం 15 డిగ్రీల లోపు ఉంటోంది. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: YS Sharmila: షర్మిల రైతు ఆవేదన యాత్ర.. పులివెందుల టూర్ పైన చర్చ!
దీంతో దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు చలితో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలిలో బయటకు రాకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో కూడా రాష్ర్టంలో వాతావరణం చలిగా ఉంటోంది. ఫలితంగా ప్రజలు ఏ పని చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇంకా మూడు నాలుగు రోజులు ఇదే విధంగా వాతావరణం ఉంటుందని సూచిస్తున్నారు.