Kidambi Srikanth: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సంచలనాన్ని నమోదు చేశాడు. పురుగుల సింగిల్స్ లో రజత పతకం సాధించిన తొలి పురుష ప్లేయర్ గా చరిత్రతో తన పేరు లిఖించుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్లో బంగారం పతకం సాధించి బ్యాడ్మింటన్లో తొలి పతకం సాధించిన భారతీయుడిగా చరిత్ర సృష్టించాలని శ్రీకాంత్ తుదివరకు ప్రయత్నించాడు. కానీ అతడికి అదృష్టం కలిసిరాకపోవడంతో రజితంతో సరిపెట్టుకోవాల్సింది.
నిన్న జరిగిన ఈ మెగా ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ గా కొనసాగుతున్న కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యు(సింగపూర్)తో తలబడ్డాడు. తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్ అనవసర తప్పదాలతో ఓటమి పాలయ్యాడు. 43నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీకాంత్ 15-21, 20-22 పాయింట్లతో లో కీన్ చేతిలో ఓడిపోయాడు. దీంతో వరల్డ్ బ్యాడ్మింటన్ కొత్త చాంపియన్ గా లో కీన్ యు అవతరించాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు శ్రీకాంత్ ఫైనాల్లో నెగ్గుతాడని అంతా భావించారు. అంతకముందు 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో లో కీన్ యుపై వరుస గేముల్లో శ్రీకాంత్ గెలిచాడు. దీంతో ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని అంతా భావించారు. గేమ్ ఆరంభం నుంచే శ్రీకాంత్ జంపింగ్ స్మాష్‌లు, నెట్ ఫ్లిక్ షాట్‌లతో అలరించాడు. తొలి సెట్లో శ్రీకాంత్ 9-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే ముందుగానే మంచి ప్రణాళికతో వచ్చిన లో కీన్ యు ఈసారి శ్రీకాంత్ ను డిపెండ్ చేయగలిగాడు.
తొలుత 3-9తో వెనుకబడ్డా లో కీన్ యు ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా నెమ్మదిగా పాయింట్స్ పెంచుకుంటూ పోయాడు. అలాగే శ్రీకాంత్ గేములో అనవసర తప్పిదాలు చేయడం లో కీన్ యుకు కలిసి వచ్చింది. లో కీన్ యు 11-11తో స్కోరును సమం చేసి ఆ తర్వాత నుంచి జోరు పెంచాడు. దీంతో లో కీన్ యు తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో కైవసం చేసుకున్నాడు.
రెండో సెట్లోనూ వీరిద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఓ దశలో శ్రీకాంత్ 9-6తో ముందంజలోకి వెళ్లినా దానిని కాపాడుకోలేకపోయాడు. ఈ స్కోరు వద్ద లో కీన్ యు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 12-9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత శ్రీకాంత్ అనవసర తప్పిదాలు చేయడం లో కీన్ యుకి కలిసి వచ్చింది. ఈ క్రమంలో లో కీన్ యు 20-18తో ముందంజ వేశాడు. ఆ వెంటనే వరుసగా రెండు పాయింట్లు గెలిచి స్కోరును 20-22తో గేమ్ ను కైవసం చేసుకున్నాడు.
Also Read: Kohli vs Ganguly: విరాట్ కోహ్లీ వర్సెస్ గంగూలీ.. ట్విట్టర్ లో ట్రెండింగ్ ఇదే
శ్రీకాంత్ ఫైనల్లో ఓడినప్పటికీ రజితంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. ప్రకాశ్ పదుకొణె (1983), భమిడిపాటి సాయిప్రణీత్ (2019) కాంస్యాలు సాధించగా రజతంతో శ్రీకాంత్ భారత బ్యాడ్మింటన్లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో పీవీ సింధు రజతం, సైనా నెహ్వాల్ కాంస్యం సాధించారు. తాజా టోర్నీలో శ్రీకాంత్ రజతం సాధించగా మరో భారత ప్లేయర్ లక్ష్యసేన్ కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు.
Also Read: Sachin Tendulkar: టీమిండియాలోకి సచిన్ పునరాగమనం చేసేనా?