Chandrababu: తెలుగుదేశం పార్టీ పలు మార్పులు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగా నాయకత్వంలో కూడా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. దీనికి ఎప్పటి నుంచో వస్తున్న డిమాండ్ల మేరకు పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా గట్టెక్కడం కష్టమే అని గుర్తిస్తోంది. దీని కోసం కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటోంది. ఇందుకు పలు కోణాల్లో ఆలోచనలు చేస్తోంది.
రాయలసీమ జిల్లాల్లో పార్టీకి కష్టాలే ఎదురుకానున్నాయి. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. దీంతో చంద్రబాబు సీమ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. సామాజిక, ఆర్థిక, వర్గ పరంగా పట్టున్న కుటుంబాలను పక్కన పెట్టుకోవాల్సిన పనిలో పడ్డారు.
Also Read: Chandrababu: అభ్యర్థుల కోసం చంద్రబాబు వెతుకులాట
సీమలో ఎక్కువగా ప్రభావం చూపేది రెండు కుటుంబాలే. పరిటాల సునీత, జేసీ కుటుంబాలు రాజకీయంగా మంచి పట్టు మీద ఉన్నాయి. దీంతో ఆ రెండు కుటుంబాలకు కనీసం రెండేసి టికెట్లు ఇచ్చేందుకు బాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జేసీ ఫ్యామిలీకి తాడిపత్రి, అనంతపురం, సునీత కుటుంబానికి ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలు కేటాయించాలని భావిస్తున్నారు. దీనికి గాను ఇప్పటికే వారికి సంకేతాలు సైతం పంపారు. దీంతో సీమలో పట్టు సాధించాలంటే వారి కుటుంబాలను చేరదీయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. దీంతోనే వారికి టికెట్లు కేటాయించి సీమలో కూడా తమ పార్టీ ఉనికి చాటుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
Also Read: CM Jagan: అంతా రివర్స్.. సీఎం జగన్ ‘ముందుగానే’ మేల్కొంటున్నారా?