https://oktelugu.com/

కాంగ్రెస్, టీఆర్ఎస్ దాగుడుమూతలు!

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు విమర్శలు, ప్రతివిమర్శలతో అసెంబ్లీని ఇటీవల హీటెక్కించాయి.. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూంలలో క్వాలిటీ లోపించడంపై ఇటీవల పెద్ద దుమారమే రేపింది. దీనికితోడు మరికొద్ది రోజుల్లో గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌‌ హైదరాబాద్‌లోని పేదలకు ఇళ్లను పంపిణీ చేసేందుకు సర్కార్‌‌ సన్నద్ధమవుతోంది. ఇప్పుడు కొత్తగా మహానగరం కేంద్రంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వివాదం సాగుతోంది. Also Read: దుబ్బాకలో పోటీచేస్తే చంపేస్తాం.. బెదిరింపులు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2020 6:25 pm
    trs congress

    trs congress

    Follow us on

    trs congressతెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు విమర్శలు, ప్రతివిమర్శలతో అసెంబ్లీని ఇటీవల హీటెక్కించాయి.. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూంలలో క్వాలిటీ లోపించడంపై ఇటీవల పెద్ద దుమారమే రేపింది. దీనికితోడు మరికొద్ది రోజుల్లో గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌‌ హైదరాబాద్‌లోని పేదలకు ఇళ్లను పంపిణీ చేసేందుకు సర్కార్‌‌ సన్నద్ధమవుతోంది. ఇప్పుడు కొత్తగా మహానగరం కేంద్రంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వివాదం సాగుతోంది.

    Also Read: దుబ్బాకలో పోటీచేస్తే చంపేస్తాం.. బెదిరింపులు

    ఇటీవల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య సవాల్ నడిచింది. సవాల్‌ను స్వీకరించిన తలసాని తానే స్వయంగా సీఎల్పీ లీడర్‌‌ భట్టి విక్రమార్క ఇంటికెళ్లి ఆయన్ను తీసుకొచ్చారు. అక్కడక్కడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను చూపించారు. నిన్న, ఈ రోజు పలు ప్రాంతాల్లో పర్యటించారు. అయితే.. సడన్‌గా ఈ పర్యటనకు బ్రేక్‌ తీసుకున్నారు. దీంతో మరోసారి ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం షురువైంది.

    ‘గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇళ్లు చూపించమంటే పక్క నియోజకవర్గాల్లోని ఇళ్లు చూపిస్తున్నారు’ అంటూ భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అసహనం వ్యక్తం చేసిన తలసాని కొల్లూరుకు రావాలంటూ వెళ్లిపోయారు. పక్క నియోజకవర్గాల్లో కాకుండా మహానగరంలోని 150 డివిజన్ల పరిధిలో ఎక్కడ చూపించినా వస్తామని భట్టి చెప్పి.. నాగారం మున్సిపాలిటీ నుంచే కాంగ్రెస్‌ నేతలు వెనుదిరిగారు. భట్టి మాత్రం రాంపల్లిలోనే ఆగిపోవడం.. మిగతా వారు ఎవరి దారిన వారు పోవడంతో ఇళ్ల పరిశీలన అర్ధంతరంగా ముగిసింది. మరోవైపు తలసాని, మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాత్రం కొల్లూరుకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.

    ‘ఇళ్లు చూపించమంటే ప్రభుత్వం పారిపోయిందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. నిన్న చూపిన 3,400 ఇళ్లను కాకుండా మహానగరంలో కట్టినవి చూపించలేదు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టకుండా వేరే ఎక్కడో కట్టిన లెక్కలు చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలు ఇళ్లు చూపించమంటే మహేశ్వరంలో చూపిస్తున్నారు. 5 నియోజకవర్గాల్లో కేవలం 3,400 ఇళ్లే కట్టారు. లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడున్నాయో చెప్పాలని’ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ను భట్టి డిమాండ్‌ చేశారు. లక్ష ఇళ్లు నిర్మించే వరకు ప్రభుత్వం వెంట పడతామంటూ భట్టి చెప్పుకొచ్చారు.

    Also Read: ఆర్టీసీ జాప్యం.. ‘ప్రైవేటు’కు లాభం?

    అయితే.. భట్టి కామెంట్స్‌పై మంత్రి తలసాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇళ్లు పూర్తిగా చూడకుండా మాట్లాడొద్దు. ప్రభుత్వం కట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లన్నీ చూపిస్తున్నాం. ఓర్వలేక కాంగ్రెస్‌ నేతలు కుంటిసాకులు చెబుతున్నారు. వస్తే అన్ని ఇళ్లను చూపిస్తాం. తుక్కగూడలో కట్టినా.. గ్రేటర్‌ ప్రజలకే ఇస్తాం’ అంటూ తలసాని మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

    ఈ ఇరు పార్టీల వ్యవహారం చూస్తుంటే దాగుడు మూతలు ఆడుతున్నట్లే కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఇళ్లు చూపిస్తామంటే రావడం లేదని టీఆర్‌‌ఎస్‌ అంటుంటే.. మహానగరంలోని కట్టిన ఇళ్లను చూపాలంటూ కాంగ్రెస్‌ వెనుతిరగడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.