https://oktelugu.com/

జగన్ క్యాబినెట్లో పెద్దగా మార్పులేమీ ఉండవా?

ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ క్యాబినెట్ లో భర్తీ కోసం చాలామంది పోటీపడ్డారు. పార్టీని నమ్ముకొని సేవలందిస్తున్న కొంతమందికి మంత్రి పదవులు లభించగా మరికొందరికీ నిరాశ ఎదురైంది. వీరికి మరోసారి క్యాబినెట్ విస్తరించిపుడు అవకాశం ఇస్తానని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో ఆరోజు కోసం వేయికళ్లతో నాయకులు ఎదురుచూస్తున్నారు. సీఎం దృష్టి తమపై పడేలా ఆయన చుట్టురా తిరుగుతూ పనులు చేస్తున్న సంగతి తెల్సిందే.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 14, 2020 12:10 pm
    Follow us on


    ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ క్యాబినెట్ లో భర్తీ కోసం చాలామంది పోటీపడ్డారు. పార్టీని నమ్ముకొని సేవలందిస్తున్న కొంతమందికి మంత్రి పదవులు లభించగా మరికొందరికీ నిరాశ ఎదురైంది. వీరికి మరోసారి క్యాబినెట్ విస్తరించిపుడు అవకాశం ఇస్తానని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో ఆరోజు కోసం వేయికళ్లతో నాయకులు ఎదురుచూస్తున్నారు. సీఎం దృష్టి తమపై పడేలా ఆయన చుట్టురా తిరుగుతూ పనులు చేస్తున్న సంగతి తెల్సిందే..

    ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..

    జగన్ రెండోసారి క్యాబినెట్ విస్తరణకు చేపట్టకముందే రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. మండలి రద్దు నిర్ణయంతో శాసన మండలి నుంచి మంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఇద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపారు. దీంతో ఖాళీగా ఉన్న రెండు మంత్రులపై నేతలు ఆశలు పెంచుకున్నారు. ఈ రెండు ఖాళీలతోపాటు క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఆశావహుల లిస్టు భారీగా పెరిగిపోయింది. గతంలో పేరు ఖరారై చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన నేతలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు.

    సీఎం జగన్ తొలుత క్యాబినెట్లో మార్పులు చేయాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో తాజా పరిస్థితుల రీత్య తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే టాక్ విన్పిస్తోంది. ఓవైపు కరోనా మహమ్మరి.. మరోవైపు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగలేదు. మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయాల్సి ఉంది. తొలి ఏడాదితోనే కొంతమందిని ఇంటికి పంపితే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. దీంతో పదవుల తేనె తుట్టును కదపకుండా ఖాళీ అయిన రెండు బెర్త్ ను మాత్రమే భర్తీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారట.

    త్వరలోనే ఏపీలో ఉప ఎన్నికలు..!

    ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఈనెల 22, 24తేదిల్లో గవర్నర్ అపాయింట్మ్ంట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ తేదిల్లో ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా ఇద్దరు మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయించేందుకు సీఎం రెడీ అవుతున్నారట. బీసీల నేతల రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను ఆ సామాజికవర్గానికి చెందిన నేతలనే భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో ఆ ఇద్దరు నేతలు ఎవరా? అనే చర్చ మొదలైంది. క్యాబినెట్ విస్తరణపై భారీ ఆశలు పెట్టుకున్న నేతలు మాత్రం జగన్ చల్లని చూపుకోసం ఎదురుచూస్తున్నారు.