OKtelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ అంటే.. బాలీవుడ్ లో స్టార్ హీరో. అలాంటి స్టార్ హీరో ఒక యంగ్ హీరోయిన్ సబా ఆజాద్ తో ప్రేమలో పడతాడా ? ఇది పుకారు అనుకున్నారు. గతకొంత కాలంగా వీరు తరచూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు అని కూడా బాగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ జంట ఆ పుకార్లను నిజం చేసింది.

తాజాగా బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ డేట్‌కి వెళ్లివస్తుండగా వీరు కెమెరాల కంటపడ్డారు. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుండగా సబా తన ముఖాన్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు మరోసారి గుప్పుమన్నాయి.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !
ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మలయాళ సూపర్ స్టార్ ముమ్మట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా కాజల్, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటించిన ‘హే సినామిక’ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. మార్చి 3న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ బృంద.. దర్శకురాలిగా మారారు. ’96’ ఫేమ్ గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు.

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. వైవిధ్య భరిత సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక మైన స్థాన్నాన్ని ఏర్పరుచుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. రాజావారురాణిగారు, SR కళ్యాణమండపం వంటి సినిమాలతో వరుసగా హిట్లను సాధించాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం సెబాస్టియన్ పిసి 524. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదలచేశారు.
Also Read: బీ కేర్ ఫుల్.. గుడ్లను ఇలా తీసుకుంటే గుండె సమస్యలు..
[…] Kailesh Bhakthi: అభిషేక ప్రియుడు అయిన పరమ శివుడిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. భగవంతుడు తమ పూజలను మెచ్చి అనుగ్రహం ఇవ్వడంతో పాటు తమ కోరికలను నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మన దేశంలో శైవ క్షేత్రాలు అత్యధికంగా ఉంటాయి. ఇకపోతే శివుడిని పూజించేందుకుగాను భక్తులు ఆయా క్షేత్రాలకు పోటెత్తుతూనే ఉంటారు. […]