Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి 10 నుంచి జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తలపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిదు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించాలని చూస్తున్నారు.ఇందులో భాగంగానే ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. ఇప్పటికే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
ఉత్తరప్రదేశ్ పై మాత్రం ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పెద్ద రాష్ట్రం కావడంతో ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడం ప్రాధాన్యంగా చూస్తున్నారు. అందుకే యూపీపై వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ బిజ్నోర్ లోని వర్థమాన్ డిగ్రీ కళాశాలలో ప్రధాని బహిరంగ నిర్వహించనున్నారు. దీనికి ఎక్కువ మంది ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉన్నా తమ ప్రచారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఫేస్ బుక్ ను యూత్ ఎందుకు దూరం పెడుతున్నారు..? దీనికి పోటీనిచ్చే యాప్ లు ఏవీ..?
యూపీలో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎలాగైనా విజయ తీరాలు చేరుకోవాలని భావిస్తున్నారు. దీంతో బీజేపీ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతోంది. కులాల వారీగా ఓట్లను బేరీజు వేసుకుని వారిని తమ దారికి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రచారం ఇంకా ఉధృతం చేయాలని చూస్తోంది.
మరోవైపు కరోనా విస్తరిస్తోన్న క్రమంలో బహిరంగ సభలు నిర్వహించొద్దని ఆంక్షలు ఉన్నా ప్రధాని మోడీ ఇవ్వాళ నిర్వహించే బహిరంగ సభకు పరిమిత సంఖ్యలోనే జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పై కాల్పులు జరిగిన క్రమంలో ఓటర్లు ఎటు వైపు నిలుస్తారో తెలియడం లేదు.
బీజేపీ మాత్రం యూపీలో పక్కాగా పాగా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బ్రాహ్మణుల ఓట్లు అధికంగా ఉన్నందున వారి ప్రాపకం కోసం ఇంకా ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. పక్కా వ్యూహంతో అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అన్ని మార్గాలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది.