Sammakka Saralamma Jatara: తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారలమ్మ జాతర. దాదాపు కోటి మంది భక్తులు దర్శించుకునే అతిపెద్ద గిరిజన జాతర. అయినా ప్రభుత్వం మాత్రం సెలవులు ఇవ్వకపోవడంపైనే అందరు ఆందోళన చెందుతున్నారు. అత్యంత జనం హాజరయ్యే జాతరగా గుర్తింపు పొందినా ఇప్పటివరకు జాతరను గౌరవించకోవడం గమనార్హం. జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో పండుగకు వెళ్లాలంటే అందరికి వీలు కావడం లేదు.
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు జాతరకు వెళ్లాలంటే సెలవు పెట్టాల్సిందే. అదే సెలవులు ఉంటే వెళ్లడానికి వీలు ఉండేది. కానీ ప్రభుత్వం ఎందుకు సెలవులు ఇవ్వడం లేదో తెలియడం లేదు. కేంద్రం పట్టించుకోకున్నా రాష్ట్ర ప్రభుత్వమైనా నాలుగు రోజులు సెలవులు ఎందుకు మంజూరు చేయడం లేదని భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద జాతరను గుర్తించడంలో ప్రభుత్వాలు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాయో అర్థం కావడం లేదు.
Also Read: మహేశ్ ‘ఒక్కడు’ చిత్రంలోని 98480 32919 ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా?
రెండేళ్లకోసారి బ్రహ్మాండమైన జాతర జరగడం తెలిసిందే. అత్యంత జనం గుమిగూడే జాతరగా కూడా సమ్మక్క జాతరకు మరో గుర్తింపు తెచ్చుకుంది. కానీ ప్రభుత్వాలే మొండి వైఖరి అవలంభిస్తున్నాయి. గిరిజన జాతర కావడంతోనే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత పెద్ద జాతరకు కనీసం సెలవులు లేకున్నా గుర్తింపు కూడా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా అంటే అదీ లేదు. దీంతో నామ్ కే వాస్తేగా జాతర నిర్వహిస్తున్నా సెలవులు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదో తెలియడం లేదు.
అన్ని మతాల పండుగలకు, జయంతి, వర్థంతిలకు సెలవులు ఇస్తున్నా సమ్మక్క జాతరకు ఎందుకు కేటాయించడం లేదు. దీంతో ఇంకా చాలా మంది జాతరకు వెళ్లడానికి ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. దేశం నలు మూలల నుంచి జనం లక్షల్లో చేరుకుంటారు. దీంతో మేడారం జనసంద్రంగా మారుతుంది. అధికారిక సెలవులు మాత్రం ఇంకా ఎప్పటికి మంజూరు చేస్తారో తెలియడం లేదు.
మేడారం జాతరకు అధికారిక సెలవులు ఈసారైనా కేటాయిస్తారో లేదో అంతుచిక్కడం లేదు. ప్రభుత్వం ఊరిస్తున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. కోటిమంది పాల్గొనే జాతరకు గుర్తింపు ఎందుకు రావడం లేదో సమాధానం లేదు. కనీసం ఇప్పుడైనా సెలవులు మంజూరు చేసి పండుగకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.