Backstabbing day: నాడు ‘ఈనాడు’ కలం.. నేడు వైసీపీ అంబరం

‘ఇదీ సంగతి’.. ఈనాడు దినపత్రికలో కొన్ని సంవత్సరాలు దిగ్గజ కార్టూనిస్ట్ శ్రీధర్ కలం నుంచి జాలు వారే కార్టూన్ లకు ఎంతో పేరుంది. ఒక్క కార్టూన్ తో ప్రత్యర్థుల బట్టలిప్పి బజారున నిలబెట్టేలా ఆయన చిత్రాలు ఉంటాయి. పత్రిక మొదలైనప్పటి నాటి నుంచి నేటి వరకు ఆయన చిత్రాల్లోని రాజకీయ వ్యంగ్యం, కౌంటర్లు, సెటైర్లు ప్రత్యర్థి రాజకీయ పార్టీలను బుక్ చేశాయి. ప్రజలకు కనువిప్పు కలిగేలా ఉంటాయి. ఒక్క ముక్కలో రాష్ట్ర రాజకీయ పరిస్థితి చెప్పేలా  ఉంటాయి. […]

Written By: NARESH, Updated On : August 23, 2021 7:14 pm
Follow us on

‘ఇదీ సంగతి’.. ఈనాడు దినపత్రికలో కొన్ని సంవత్సరాలు దిగ్గజ కార్టూనిస్ట్ శ్రీధర్ కలం నుంచి జాలు వారే కార్టూన్ లకు ఎంతో పేరుంది. ఒక్క కార్టూన్ తో ప్రత్యర్థుల బట్టలిప్పి బజారున నిలబెట్టేలా ఆయన చిత్రాలు ఉంటాయి. పత్రిక మొదలైనప్పటి నాటి నుంచి నేటి వరకు ఆయన చిత్రాల్లోని రాజకీయ వ్యంగ్యం, కౌంటర్లు, సెటైర్లు ప్రత్యర్థి రాజకీయ పార్టీలను బుక్ చేశాయి. ప్రజలకు కనువిప్పు కలిగేలా ఉంటాయి. ఒక్క ముక్కలో రాష్ట్ర రాజకీయ పరిస్థితి చెప్పేలా  ఉంటాయి. నాటి వేడి ఇప్పుడు లేకపోయినా ఆ కార్టూన్ లు ఇప్పటికీ అద్భుతమే అని చెప్పాలి.

ఆది నుంచి కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం గల పత్రికాధినేత మొదట ఎన్టీఆర్ కు మద్దతుగా తెలుగుదేశం రాజకీయ అధికారం సాధించడంలో మద్దతుగా నిలిచాడని పొలిటికల్ అనలిస్టులు చెబుతుంటారు. అయితే తెలుగుదేశం పార్టీలోకి ‘లక్ష్మీపార్వతి’ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చంద్రబాబు వెన్నుపోటు పొడిచే వరకూ రాజకీయం వేడెక్కింది.

నాడు ఎన్టీఆర్ కు మద్దతు ఇచ్చిన అదే టీడీపీ అనుకూల పత్రిక.. పార్టీలో లక్ష్మీపార్వతి ప్రాబల్యం చూసి అదే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా  కథనాలు ప్రచురించింది. కార్టూన్లు వేసి ఆయనను ప్రజల్లో విలన్ గా చూపించే ప్రయత్నం చేసింది. దీనంతటికి సాక్ష్యంగా ఇప్పటికీ నాటి కార్టూన్లు కనిపిస్తున్నాయి.

లక్ష్మీ పార్వతి చేతిలో ఎన్టీఆర్ కీలుబొమ్మగా మారాడని.. లక్ష్మీ పార్వతినే తెలుగుదేశం పార్టీ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తోందని అర్థం వచ్చేలా పత్రిక కార్టూన్లు వెలువరించింది. ఆ తర్వాత ‘పారూ.. ఎన్టీఆరూ’ అంటూ ఇద్దరి రాజకీయం పార్టీలో నడుస్తోందనేలా కార్టూన్లు వేశారు. నాడు రోజు ఒక గంట మాత్రమే ఆలోచిస్తానన్న ఎన్టీఆర్ ప్రకటనపై వేసిన కార్టూన్ సైతం ఇప్పటికీ ప్రత్యర్థులు వైరల్ చేస్తున్నారు.

మొత్తంగా లక్ష్మీపార్వతి ఉండగా ఎన్టీఆర్ పై ఇదే పత్రిక వ్యతిరేకంగా ప్రచారం చేసిన క్లిప్ లను ఇప్పుడు వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్వయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. తాజాగా ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన ఆగస్టు 23ను ‘అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం’గా ప్రకటించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే నాడు పత్రిక ఎన్టీఆర్ పై ఏ స్థాయిలో విరుచుకుపడిందో కళ్లకు కట్టేలా నాటి కార్టూన్ లను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. కథనాలను షేర్లు చేస్తూ చంద్రబాబు, సదురు పత్రికాధినేత తీరును వైసీపీ శ్రేణులు హోరెత్తిస్తున్నారు. నాటి కార్టూన్లు ఇప్పుడు  వైరల్ అవుతున్నాయి.