Lord Shiva
Lord Shiva : శివ ధ్యానం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది.. శివ ధ్యానం వల్ల జీవితం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతుంది.. శివనామ స్మరణం వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి.. అయితే నేటి కాలంలో చాలామందికి ఆధ్యాత్మిక తపై మనసు పడడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ వాటిని భవిష్యత్ తరాల వారికి అందిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న పిల్లలకు ఇలాంటివి పెట్టడం వల్ల వారి జీవితం ఎంతో ఆనందమయంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే శివుడి వద్ద ఉన్న కొన్ని మనుషుల జీవితాలకు సంబంధించిన వి ఉన్నాయి. వాటి గురించి నేటి పిల్లలకు చెప్పడం ద్వారా వారి జీవితం ఆనందమయంగా మారుతుంది. ఆ విషయాలు ఏంటంటే?
శివ ధ్యానం:
శివుడు నిత్యం ధ్యానం చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇలా ధ్యానం చేయడానికి కారణం ఏంటి అని చాలామందికి సందేహం ఉంటుంది. ధ్యానం వల్ల ఎంతో జ్ఞానం వస్తుంది. మనసు అదుపులో ఉంటుంది. ప్రతికూల వాతావరణం నుంచి బయట పడేస్తుంది. విద్యార్థులు తమ చదువును కేంద్రీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. దానిని శివ ధ్యానం సూచిస్తుంది. అందువల్ల శివ ధ్యానం గురించి నేటి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
శివుడి మూడో కన్ను:
శివుడి మూడో కన్ను అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే శివుడు త్రినేత్రాన్ని తెలిస్తే లోకం బుగ్గి అవుతుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ త్రినేత్రాన్ని భయంగా కాకుండా దాని గురించి అవగాహన చేసుకోవాలి. శివుడికి త్రినేత్రాలు ఉన్న దృష్టి ఒకే దానిపై ఉంటుందని చెప్పడానికే ఈ మూడవ కన్ను. త్రినేత్రంతో చూడడం వల్ల ఎంతో శక్తి ప్రసాదిస్తుందని శివుని మూడో కన్ను తెలుపుతుంది. ఎందుకంటే శివుని మూడో కన్ను ద్వారా తన మనసు ద్వారా చూస్తాడు. అందువల్ల నేటి విద్యార్థులు తమ దృష్టిని ఒకే చోట కేంద్రీకరించాలంటే ఇలా త్రినేత్రం లా చూడాలని చెప్పాల్సిన అవసరం ఉంది..
నీలకంఠుడు అని ఎందుకంటారంటే?
మహా శివుడికి అనేక పేర్లు ఉన్నాయి. వీటిలో నీలకంఠుడు ఒకటి. చాలామందికి నీలకంఠుడు అనగానే సముద్ర మథనం గురించి చెబుతారు. అయితే లోకం వివాదాలకు పోకుండా ఉండాలని శివుడు ఆకరణాన్ని తన కంఠంలో ఉంచుకుంటాడు. అంటే ఎలాంటి స్వార్థం లేకుండా లోక కళ్యాణార్థం కొన్ని కార్యక్రమాలు చేస్తాడు. దీనిని పిల్లలకు చెప్పడం ద్వారా వారు భవిష్యత్తులో ఇలాంటి స్వార్థం లేకుండా సమాజం సేవలో మునిగిపోవడానికి అవసరమవుతుంది..
శివుని జుట్టులో గంగ ఎందుకు?
గంగ ఎక్కడ ఒకచోట నిలవదు. కానీ శివుని జుట్టులో మాత్రం బందీ అయి ఉంటుంది. అంటే గంగను శివుడు తన దృష్టిలో నియంత్రిం చే శక్తిని తెలుపుతుంది. విద్యార్థులు సైతం ఇలాంటి పనైనా చేయడానికి వ్యక్తిని పొందేందుకు నియంత్రణ అవసరమని తెలుపుతుంది.
డమరుక శబ్దం అర్థం ఇదే..
డమరుక శబ్దం వినగానే మహాశివుడు గుర్తుకు వస్తాడు. అయితే ఈ డమరుక శబ్దం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని తెలుపుతుంది. అలాగే సాంప్రదాయాలను కాపాడాలని ఈ శబ్దం నిర్వహిస్తుంది. నేటి కాలం విద్యార్థులు సంప్రదాయాలకు కట్టుబడి ఉండేలా డమరుక శబ్దం సూచిస్తుంది.
నందీశ్వరుడు:
శివుని చెంత నందీశ్వరుడు కచ్చితంగా ఉంటారు. తోటి వారితో స్నేహం చేయడానికి సహనం, నమ్మకం, విశ్వాసం, విధేయతను తెలపడానికి నందీశ్వరుడు నిదర్శనంగా పేర్కొంటారు.