https://oktelugu.com/

Mahashivratri : ఇక్కడ త్రిమూర్తులూ ఒకే చోట లింగం రూపంలో ఉంటారు.. శివరాత్రి రోజున దర్శించుకుంటే ఎంతో పుణ్యం.. ఇంతకీ ఈ క్షేత్రం ఎక్కడ ఉందంటే..

Mahashivratri : శివుడు అభిషేక ప్రియుడు.. నిర్వికారుడు.. నిష్ట తో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేర్చుతాడు. అందుకే పరమేశ్వరుడిని భోళా శంకరుడు అని పిలుస్తారు. నేడు శివరాత్రి. ఈ పర్వదిన రోజున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకదానిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని.. పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చారిత్రక ఐతిహ్యం.

Written By: , Updated On : February 26, 2025 / 10:25 AM IST
Mahashivratri

Mahashivratri

Follow us on

Mahashivratri : ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహారాష్ట్రలో ఉన్న నాసిక్ త్రయంబకేశ్వరం కూడా ఒకటి. జ్యోతిర్లింగాలలో ఇది పదవది. గౌతమి మహర్షి తపస్సు చేయడంతో శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆదిపరాశక్తితోపాటు బ్రహ్మ, విష్ణుతో కలిసి శివుడు గౌతమి మహర్షి ఎదుట సాక్షాత్కారం అవుతాడు. శివుడు తన కోరికను మెచ్చి.. తన తపస్సును నచ్చి ఆదిపరాశక్తి, బ్రహ్మ, విష్ణు సమేతంగా ప్రత్యక్షం కావడంతో గౌతమి మహర్షి ఆనందానికి అవధులు ఉండదు. తన భక్తిపారవశ్యాన్ని శివుడి ఎదుట గౌతమి మహర్షి ప్రదర్శిస్తాడు. ఆనందంతో నృత్యం చేస్తాడు. ఆ తర్వాత శివుడు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి గౌతమి మహర్షి బ్రహ్మగిరి పర్వతంపై గంగ ప్రవహించేలా చేయాలని కోరతాడు. దానికి శివుడు తన జటాజూటాన్ని విసిరిస్తాడు. అది బ్రహ్మగిరి పర్వతంపై పడుతుంది. ఫలితంగా ప్రవాహం ఏర్పడుతుంది. ఆదిపరాశక్తి, త్రిమూర్తులు స్వయంభుగా ఇక్కడ వెలియడంతో జ్యోతిర్లింగంగా మారుతుంది. పదవ జ్యోతిర్లింగంగా త్రయంబకేశ్వరం నిలిచింది. ఇక్కడ త్రిమూర్తులు ఒకే చోట లింగం రూపంలో ఉండడం విశేషం.

శివరాత్రి రోజు ఇలా

త్రయంబకేశ్వరంలో శివరాత్రి రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వయంభుగా వెలసిన జ్యోతిర్లింగం కావడంతో అర్చకులు స్వామివారికి పూజలు అద్భుతంగా జరుపుతారు. స్వామివారికి సాయంత్రం కళ్యాణం చేస్తారు.. ఈ క్షేత్రంలో జరుగుతున్న వేడుకలను చూసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు హాజరవుతుంటారు. గంగలో స్నానం చేసి.. జ్యోతిర్లింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ ప్రాంతం పూర్తిగా గుట్టలతో.. వృక్షాలతో నిండి ఉంటుంది. అందువల్లే ఈ ప్రాంతాన్ని చూసేందుకు భక్తులు భారీగా వస్తుంటారు.. కేవలం శివరాత్రి మాత్రమే కాదు.. మిగతా సందర్భాల్లోనూ భక్తులు భారీగానే వస్తుంటారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఉంది. ఇదే ప్రాంతంలో గోదావరి నది ఉద్భవించింది. ఇక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. గౌతమి మహర్షి తపస్సు చేసిన దృశ్యాలు ఈ ప్రాంతాల్లో కనిపిస్తాయి. జ్యోతిర్లింగం ఏర్పడిన ఆనవాళ్లు.. శివుడు తన జటాజూటాన్ని వదిలిన తీరు ఇప్పటికీ అక్కడ దర్శనమిస్తుంది. శివరాత్రి రోజు ఇక్కడ జరిగే శివకళ్యాణం కన్నుల పండువగా ఉంటుంది.. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతో భక్తులు భారీగా వస్తుంటారు..ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ కాటేజీలు కూడా ఉంటాయి. శివరాత్రి ముందు పది రోజుల నుంచే ఈ క్షేత్రం కిటకిటలాడుతుంది. కాకపోతే ఇక్కడ జరిగే పూజలు వేరే విధంగా ఉంటాయి.. మహా కుంభాభిషేకం.. అన్నాభిషేకం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతాయి. అన్నాభిషేకం తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు ఇక్కడ వితరణ చేస్తారు.

Mahashivratri