Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga : కేవలం మూడు చిత్రాలతో దేశంలోని టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి (Arjun Reddy) మూవీ దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. కబీర్ సింగ్ ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాంతో బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన రన్బీర్ కపూర్ అవకాశం ఇచ్చాడు. రన్బీర్ కపూర్ ఇమేజ్ కి భిన్నమైన వైలెంట్ యాక్షన్ డ్రామా చేసి ఇండస్ట్రీ అందుకున్నాడు.
సందీప్ రెడ్డి-రన్బీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) ప్రతి సినిమా వివాదాలు రాజేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీపై టాలీవుడ్ లో పెద్ద చర్చ నడిచింది. మితిమీరిన శృంగారం, మహిళపై దాడులు అంటూ టీవీ డిబేట్ లు నడిచాయి. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ని కూడా బాలీవుడ్ లో కొందరు వ్యతిరేకించారు. ఇక యానిమల్ అయితే మరింత వివాదం రాజేసింది.
Also Read: మోక్షజ్ఞకు హ్యాండ్ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ, స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీకి సిద్ధం!
పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఓపెన్ గానే సందీప్ రెడ్డి వంగను విమర్శించారు. అమిర్ ఖాన్ మాజీ వైఫ్ కిరణ్ రావుతో సందీప్ రెడ్డి వంగకు మాటల యుద్ధం జరిగింది. ఒక్కరు కాదు చాలా మంది బాలీవుడ్ పెద్దలు యానిమల్ మూవీని చెత్త మూవీగా అభివర్ణించారు. విమర్శలను అదే స్థాయిలో తిప్పికొడుతూ వచ్చాడు సందీప్ రెడ్డి వంగ. తాజాగా మరోసారి ఈ ఆరోపణల మీద సందీప్ రెడ్డి స్పందించాడు.ఆయన బాలీవుడ్ ప్రముఖులను సూటిగా ఒకటే ప్రశ్న అడిగాడు.
నన్ను విమర్శించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు యానిమల్ హీరో రన్బీర్ కపూర్ ని ఎందుకు తిట్టలేదు? ఆయన్ని విమర్శించే ధైర్యం ఉందా?. యానిమల్ సినిమా చెడ్డది అయితే అందులో నటించిన హీరోని కూడా నిందించాలి. కానీ రన్బీర్ కపూర్ ని నిందించే ధైర్యం వాళ్లకు ఉండదు. అలా చేస్తే వాళ్లకు జరిగే నష్టం తెలుసు. వాళ్లతో రన్బీర్ కపూర్ సినిమాలు చేయడు. ఆయన అవసరం వాళ్లకు ఉంది. దర్శకుడు రెండేళ్లకు ఒక సినిమా చేస్తాడు. హీరో మాత్రం ఏదో విధంగా కనిపిస్తూనే ఉంటాడు.. అని ఓపెన్ అయ్యాడు. కాగా సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్న సంగతి తెలిసిందే..