Telangana Traffic E Challans: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించకుండా ఉండేందుకే కేంద్ర రవాణా చట్టాన్ని పటిష్టంగా అములు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వివిధ వాహన పత్రాలు లేనివారికి విధించే జరిమానాను భారీగా పెంచుతోంది. ఈమేరకు నూతన రవాణా చట్టాన్ని కూడా అమలులోకి తెచ్చింది. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ట్రాఫిక్ క్రబమద్దీకరణ పేరుతో ఈ చలాన్ రూపంలో భారీగా జరిమానా వసూలు చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పక్కన పెట్టి ఈ చలాన్‌పై దృష్టిపెట్టడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం జరిమానా వసూలుకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతుంది.
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రూ.95 లక్షలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరకు ఉమ్మడి ఆధ్రప్రదేశలో ట్రాఫిక్ చలాన్ల వసూలు కోటి రూపాయలు కూడా మించకపోయేవి. 2014లో ట్రాఫిక్ చలాన్ల కేసులు 50 లక్షలుగా నమోదు కాగా, ఫైన్ల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ. 95 లక్షలుగా ఉంది. చలానా వసూల మొదలు పెట్టిన తర్వాత గరిష్టంగా వసూలు చేసిన ఫైన ఇదే.
Also Read: Amit Shah- Chandrababu: రామోజీరావు మాస్టర్ ప్లాన్.. నేడు అమిత్ షా, చంద్రబాబు భేటీ?
తెలంగాణలో ఏటా రూ.500 కోట్లు..
తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ మొదటి ఏడాది ప్రజారంజక పాలన అందించారు. తర్వాత పోలీస్ వ్యవస్థ బలోపేతం, ట్రాఫిక్ చలానాల వసూలుపై దృష్టిపెట్టారు. మొదటి ఏడాది 2016లో రూ.10 కోట్ల వరకు ఈ చలాన్ రూపంలో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వసూలు చేశారు. ఆ తర్వాత నుంచి ఏటా ఈ చలానాల వసూలు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఏడాదికి రూ.500 కోట్లకుపైగా ఈ చలానా రూపంలో తెలంగాణ ప్రభుత్వం ఫైన్ వసూలు చేస్తోంది. 2020, 2021లో కరోనా నినబంధనలు అములలో ఉండడంతో నిబంధనల ఉల్లంఘన పేరుతో భారీగా ఫైన్లు వసూలు చేసింది 2020లో రూ.500 కోట్లు ఈ చలానా రూపంలో వసూలు చేయగా, 2021లో అన్ని రకాల జరిమానాలు కలిపి 2 కట్లో కేసులు పెట్టి రూ.877 కోట్ల ఫైన్ వసూలు చేసింది. టీఆర్‌ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో అన్ని రకాల కేసులు కలిపి 9 కోట్ల నమోదు చేసింది. 2,671 కోట్ల రూపాయలను ఫైన్లుగా వసూలు చేసింది.
అర్ధరాత్రి వరకూ బార్లు, వైన్ షాపులు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకు బార్లు రాత్రి 11 గంటలకు మాత్రమే అనుమతి ఉండేది. ప్రత్యేక సందర్భాలు అంటే డిసెంబర్ 31, ఇతర పండుగల వేళల్లో మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మద్యం షాపులు తెరిచి ఉంచే సయాన్ని ప్రభుత్వం రాత్రి 10:30 గంటల వరకు పెంచింది. ఇక బార్లను అర్ధరాత్రి 12 గంటల వరకూ రోజూ తెరిచి ఉంచేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇక ప్రత్యేక రోజుల్లో మద్యం షాపులు 12 గంటల వరకు, బార్లు 1 గంట వరకు తెరిచి ఉంటాయి.
చలాన్ల వసూలుకే ట్రాఫిక్ పోలీసుల ప్రాధాన్యం..
ట్రాఫిక్ పోలీసులు తెలంగాణలో అభాసుపాలవుతున్నారు. దేశంలో ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసుల విధి రోడ్లపై వాహనాల రద్ధీని క్రమబద్ధీకరించడం, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు మాత్రం నిబంధనలు ఉల్లంఘించేవారిని గుర్తించడం, వారికి ఈ చలాన్ విధించడమే తమ విధి అన్నట్లు విధులు నిర్వహిస్తున్నారు. అసలు వారు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధులనూ పూర్తిగా మర్చిపోయారన్న విమర్శలు వ్యక్తమవ్వడం ట్రాఫిక్ పోలీసుల విధులకు అద్ధం పడుతోంది. మరోవైపు ప్రభుత్వం మద్యం షాపులు, బార్లకు అర్ధరాత్రి వరకు అనుమతి ఇచ్చి పోలీసులను ఆయా షాపులు పక్కనే చీకట్లో మాటేసి, డ్రంకన్ డ్రైవ్ పేరుతో చలాన్లు బాదేలా చేస్తోంది. ట్రాఫిక్ అధికారులను కేవలం ఫొటోలు తీసేందుకు, చలాన్లు రాసేందుకు మాత్రమే అన్నట్లుగా మార్చేసిందన్న విమర్శలు ఉన్నాయి.
Also Read:YCP: చేజేతులా ఆ వర్గాలను వదులకున్న వైసీపీ..వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బే..