Karthikeya 2 Box Office Collection: కార్తికేయ 2 ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబడుతోంది. మొత్తానికి పాన్ ఇండియాని నిఖిల్ షేక్ చేస్తున్నాడు. ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ 2′ ఇప్పుడు ఒక సంచలనం. అందుకే.. కార్తికేయ-2 సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ప్రశంసలు కురిపిస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. అయినా ఆర్జీవీ పోస్ట్ పెట్టకపోతే షాక్ అవ్వాలి గానీ, పెడితే షాక్ అవ్వడం ఎందుకు ?, ఇంతకీ వర్మ ఏం పోస్ట్ పెట్టాడో తెలుసా ?, “ఆమిర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ కంటే.. నిఖిల్ ‘కార్తికేయ-2’ విడుదలైన రెండో శుక్రవారం డబుల్ కలెక్షన్లు సాధించింది. అలాగే రాజమౌళి తీసిన RRR, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF-2 కంటే కార్తికేయ-2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డైరెక్టర్ చందు మొండేటి, ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్‌కు నా అభినందనలు” అని వర్మ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
మొత్తమ్మీద మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తోంది. నిఖిల్ చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. మరీ బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ సక్సెస్ ఏ స్థాయిలో ఉంది ?, అసలు ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, ఇంతకీ నిర్మాతకు ఏ రేంజ్ లో లాభాలు వచ్చాయో ? చూద్దాం రండి.
ముందుగా ‘కార్తికేయ 2’ సినిమా 10 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 6.73 కోట్లు
సీడెడ్ 2.97 కోట్లు
ఉత్తరాంధ్ర 252 కోట్లు
ఈస్ట్ 1.58 కోట్లు
వెస్ట్ 1.04 కోట్లు
గుంటూరు 1.73 కోట్లు
కృష్ణా 1.41 కోట్లు
నెల్లూరు 0.73 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 10 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘కార్తికేయ 2’ రూ. 19.02 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 38.04 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.62 కోట్లు
ఓవర్సీస్ 3.05 కోట్లు
హిందీ మరియు ఇతర వెర్షన్లు 2.97 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 10 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘కార్తికేయ 2’ రూ. 26.35 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 52:70 కోట్లను కొల్లగొట్టింది
కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ, పది రోజులకు ఈ చిత్రం 26.35 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ సాధించినట్టే. నిజానికి ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు. అయితే, ‘కార్తికేయ 2’ కోసం ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ దగ్గర కనిపించారు. ఆ రేంజ్ లో ఈ చిత్రం సక్సెస్ అయ్యింది. మొత్తానికి నిఖిల్ బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబట్టాడు.
Also Read:Indian Film Industry: ఇండియన్ సినిమా డామినేషన్.. హాలీవుడ్‌తో పోటీ..!