Telangana New IT Minister: తెలంగాణ కొత్త ఐటీ మినిస్టర్.. పేలుతున్న మీమ్స్.. చూస్తే నవ్వాగదు

తెలంగాణలో గడచిన పది సంవత్సరాలలో ఐటి శాఖను కేటీ రామారావు పర్యవేక్షించారు. జయేష్ రంజన్ వంటి వారు సెక్రటరీ హోదాలో ఐటీ శాఖ ఉన్నతి కోసం పనిచేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 6, 2023 11:55 am

Telangana New IT Minister

Follow us on

Telangana New IT Minister: తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి.. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఎల్బీ స్టేడియం వేదికగా గురువారం ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది? ఎవరికి ఎలాంటి అధికారం దక్కబోతోంది? ఎటువంటి పోర్ట్ పొలియో కేటాయి స్తారు? అనేవాటిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం ఒక మంత్రి పదవి కోసం చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో నెటిజన్ల నుంచి మీమ్స్ పేలుతున్నాయి.

ఏమిటా శాఖ

తెలంగాణలో గడచిన పది సంవత్సరాలలో ఐటి శాఖను కేటీ రామారావు పర్యవేక్షించారు. జయేష్ రంజన్ వంటి వారు సెక్రటరీ హోదాలో ఐటీ శాఖ ఉన్నతి కోసం పనిచేశారు. ఈ క్రమంలో ఐటి అనేది మారుమూల గ్రామాలకు కూడా విస్తరించింది. బహుళ జాతి కంపెనీలు రాకపోయినప్పటికీ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే చిన్న స్థాయి కంపెనీలు.. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ లలో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.. అయితే ఐటీ అభివృద్ధి హైదరాబాదులో కని విని ఎరుగని స్థాయిలో ఎదిగింది. గత ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో ఐటీ కి పునాదులు పడగా.. నిన్నటి వరకు అధికారం లో ఉన్న భారత రాష్ట్ర సమితి రాయితీలు ఇవ్వడంతో పెద్దపెద్ద కంపెనీలు తమ కార్యాలయాలను హైదరాబాదులో ఏర్పాటు చేశాయి. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావడం మొదలుపెట్టింది. స్థానికంగా ఉన్న యువతకు కూడా ఉపాధి లభించడంతో హైదరాబాద్ అనేది మరింత అభివృద్ధి చెందింది. గ్రేటర్ పరిధిలో భారీ స్థాయిలో కంపెనీలు ఏర్పాటు కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం వల్ల రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వానికి దండిగా ఆదాయం వస్తున్నది. ఇంతటి కీలకమైన ఐటీ శాఖను ఇప్పుడు ఎవరు చేపడతారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఎవరికి కేటాయిస్తారు?

భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖను కేటీఆర్ పర్యవేక్షించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి కేటాయిస్తారు అనేది సందిగ్ధంగా మారింది.. అయితే దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ చెలరేగుతున్నాయి.. ఒక్కొక్కరు ఒక విధంగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.. ఐటీ శాఖను కేటీఆర్ తప్ప ఎవరూ సమర్ధవంతంగా నిర్వహించరని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు ఆ శాఖను తీసుకుంటారో, ఏ మేరకు తెలంగాణకు న్యాయం చేస్తారోనని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆదరణ పొందిన తెలుగు సినిమాల్లో కొన్ని సన్నివేశాలను మీమ్స్ గా రూపొందించి కాంగ్రెస్ పార్టీ నాయకులను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరికొందరైతే మీ పార్టీ ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేయాలని కేటీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.