Kalyan Ram: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తక్కువ టైంలోనే మంచి హీరోగా ఇండస్ట్రీలో తనదైన మార్క్ ని సృష్టించుకున్నాడు. అలాగే కమర్షియల్ సినిమాలను చేస్తూ మంచి విజయాలను దక్కించుకున్నాడు. ఒకానొక టైంలో వరుసగా ప్లాప్ లు రావడంతో ఆయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతాడా అనే డౌట్లను చాలామంది వ్యక్తం చేశారు కానీ వాటన్నింటికీ బ్రేక్ వేస్తూ మంచి హిట్ సినిమాలు తీస్తూ వచ్చాడు…
ఇక మొదట్లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ని పరిచయం చేస్తూ ఆయన చేసిన అతనొక్కడే సినిమా మంచి విజయం దక్కించుకుంది. ఇక మళ్ళీ అనిల్ రావిపూడి ని డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ పటాస్ అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత కొన్ని ప్లాప్ లు వచ్చినప్పటికీ మళ్ళీవశిష్ఠ ని డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసి బిబిసారా అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతో మరి కొంత మంది కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికీ వాళ్ళు సినిమాలను సక్సెస్ చేయలేక కళ్యాణ్ రామ్ ని ఇబ్బంది పెడుతూ చాలా ఆయన్ని రకాలుగా నష్టపరిచారని తెలుస్తుంది.
ముఖ్యంగా కళ్యాణ్ రామ్ అవకాశాలు ఇచ్చిన వారిలో సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ఠ లాంటి ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే అయన పేరు నిలబెట్టారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా తన పేరు నిలబెట్టుక పోగా తనకు భారీగా నష్టాలను తీసుకొచ్చి పెట్టారు. అయితే కళ్యాణ్ రామ్ చేస్తున్న తప్పేంటి అంటే ఆయనకి వచ్చి కథ చెప్పిన వాళ్ళకి డైరెక్టర్ గా అవకాశం ఇస్తున్నాడు. అతనికి సినిమా తిసెంత టాలెంట్ ఉందా లేదా అని ఆలోచించకుండా వాళ్ళకి అవకాశాలను ఇస్తున్నాడు.
ఇక ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ చేసింది ఒక వంతుకు కొత్త డైరెక్టర్లకి ప్లస్ అవుతుంది. కానీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కళ్యాణ్ రామ్ తో చేసే సినిమా మీద ఏమాత్రం ఫోకస్ పెట్టకుండా ఆ సినిమా ని ప్లాప్ చేస్తున్నారు.ఇక ఇటువంటి వాటి వల్ల కళ్యాణ్ రామ్ భారీ గా నష్టపోతున్నాడు. అందుకే ఇక మీదట కళ్యాణ్ రామ్ నష్టపోకూడదు అంటే తాను ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైన డైరెక్ట్ గా వచ్చి కథ చెప్తే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు కానీ దానికి ఆ డైరెక్షన్ చేసే అబ్బాయి దగ్గర సినిమాని డీల్ చేయగలిగే కెపాసిటీ ఉందా లేదా అనేది టెస్ట్ చేసి సినిమా చేయాలనే ఉద్దేశ్యం లో కళ్యాణ్ రామ్ ఉన్నట్టుగా తెలుస్తుంది…