Telangana TRS Leaders Joins BJP: తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరాటం సాగుతోంది. దీంతో అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది. దీన్ని అడ్డుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించి బీజేపీని అధికారంలోకి రానీయకూడదని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో దూకుడు మీదుంది. టీఆర్ఎస్ ను రాష్ట్రంలో మట్టికరిపించి బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తోంది.
ఈ మేరకు పలువురు బీజేపీ వైపుచూస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. భవిష్యత్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని భావించి ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ రేపు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ నివాసంలో ఉదయం భిక్షమయ్య కాషాయ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.
Also Read: Indian Railways: ఈ తప్పులు చేయవద్దు.. రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు. ఇంకా కొందరు నేతలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మరింత మంది బీజేపీలోకి క్యూ కట్టనున్నట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలిసిపోతున్నందున అందరు కాషాయ పార్టీని గుర్తిస్తున్నట్లు పలువురి వాదన.
భవిష్యత్ లో ఇంకా కొంతమంది బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం తీసుకొస్తున్న పథకాలతో ఆకర్షితులై పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. అందుకే బీజేపీలో చేరాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున నేతలు బీజేపీలో చేరి పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ కు భంగపాటు తప్పదనే వాదనలు కూడా వస్తున్నాయి.
ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత ఏప్రిల్ 14 నుంచి ప్రారంభించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్ర ద్వారా టీఆర్ఎస్ విధానాలు ఎండగట్టేందుకు సిద్ధపడనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి టీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read:Jagan Shocks MLA Balakrishna: ఎమ్మెల్యే బాలకృష్ణకు షాక్ ఇచ్చిన జగన్