Jobs: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 7, ఎమ్‌ఎస్‌ఎస్-iii ఉద్యోగ ఖాళీలు 7, ఎమ్‌ఎస్‌ఎస్-iii ఉద్యోగ ఖాళీలు 4 భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. మూడేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఆన్‌లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సీడ్యాక్ అధికారిక వెబ్‌సైట్‌లో కెరీర్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి సులభంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
https://www.cdac.in/index.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది.