Liquor Sales in Telangana: మద్యం అమ్మకాల్లో మనల్ని మించిన వారు ఉండరు. దేశంలోనే అత్యధిక మద్యం తాగే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కావడం గమనార్హం. ఏటా లక్షల లీటర్ల మద్యం సేవిస్తూ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుస్తున్నారు. మద్యం అమ్మకాల్లో బీర్లదే ప్రత్యేక స్థానం కావడంతో లక్షల లీటర్ల బీర్లు తాగేస్తున్నారు. మద్యం ప్రియులకు బీర్లంటేనే ఎక్కువ ఆసక్తి. అందుకే నిత్యం బీర్లను తాగేందుకు ఇష్టపడుతుంటారు. దీంతో మద్యం ప్రియులకు బీర్ల మీద ఉన్న మజాయే వేరుగా ఉంటుంది. చల్లని బీరేస్తేనే కిక్కు వస్తుందని నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా బీర్లు తాగాలని ఉబలాటపడుతుంటారు.

దక్షిణ భారతదేశంలోనే మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్ గా నిలవడం తెలిసిందే. మద్యం అమ్మకాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడంతో ఆదాయం కూడా భారీగానే ఉంటోంది. దీంతో ప్రభుత్వ నిర్వహణకు మద్యం ఆదాయం ఇంధనంలా పనిచేస్తోందనడంలో అతిశయోక్తి కాదు. దీనిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ తెలంగాణను నెంబర్ వన్ గా చేస్తానని మాట నిలబెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తాగుబోతుల తెలంగాణగా నెంబర్ వన్ స్థానంలో నిలపడంలో ఆయన కృషి ఫలించిందని చెబుతున్నారు. అభివృద్ధి మాట ఎలా ఉన్నా మద్యం అమ్మకాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం విశేషంగా ఉందని ట్వీట్ చేశారు.
Also Read: Toxic Fevers Rise in Telangana: బెడ్డుపై బాల్యం.. తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు
ఆంధ్రప్రదేశ్ కూడా రెండో స్థానంలో నిలిచింది. బీర్ల అమ్మకాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోవడంతో ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఏపీలో అయితే లోకల్ బ్రాండ్లదే ప్రధాన భూమిక కావడం తెలిసిందే. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం సూచించిన బ్రాండ్లను అమ్ముతుంది. బీర్లు తాగడంలో మనవారి ప్రతాపం మామూలుగా లేదు. బీర్లు తాగడంలో మనవారి తాగే టాలెంట్ మామూలుగా లేదు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయమే వస్తోంది.

తెలంగాణలో కూడా మద్యం ద్వారా ఎక్కువ ఆదాయం రావడంతోనే ప్రభుత్వ మనుగడ సాగుతోంది. దీంతో మద్యం మీదే ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తాయనడంలో అతిశయోక్తి లేదు. మందు తాగడం హానికరం అని లేబుల్ వేసి మరీ ప్రభుత్వం మద్యం అమ్ముతూ లాభపడుతోంది. ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. మళ్లీ తాగి వాహనాలు నడుపుతున్నారని పట్టుకుంటుంది. ఇలా రెండు పనులు చేస్తూ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటోంది. దీంతో మద్యం ప్రియులకు నానా చిక్కులు వస్తున్నా లెక్కచేయడం లేదు. మద్యం తాగుతూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూనే ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిస్తున్నారనడంలో సందేహం లేదు.
Also Read:Dasoju Sravan: కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ.. రాజగోపాల్ రెడ్డి బాటలో దాసోజు శ్రావణ్