https://oktelugu.com/

‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజుకు రోజుకు పెరిపోతున్నాయి. గడిచిన వారంరోజులుగా కేసుల గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు పాజిటివ్ కేసుల్లో ముందంజలో ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ ఆ రాష్ట్రాలను వెనక్కి నెట్టి పాజిటివ్ రేటులో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. జులై 8నాటికి రాష్ట్రంలో పాజిటివ్ రేటు 21.91శాతం నమోదైంది. ఇది జాతీయ పాజిటివ్ రేటు(7.14 శాతం)తో పోలిస్తే మూడింతలు అధికంగా నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే మరణాల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2020 / 11:42 AM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజుకు రోజుకు పెరిపోతున్నాయి. గడిచిన వారంరోజులుగా కేసుల గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు పాజిటివ్ కేసుల్లో ముందంజలో ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ ఆ రాష్ట్రాలను వెనక్కి నెట్టి పాజిటివ్ రేటులో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. జులై 8నాటికి రాష్ట్రంలో పాజిటివ్ రేటు 21.91శాతం నమోదైంది. ఇది జాతీయ పాజిటివ్ రేటు(7.14 శాతం)తో పోలిస్తే మూడింతలు అధికంగా నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే మరణాల రేటు తెలంగాణ తగ్గటం ఊరటనిచ్చే అంశంగా కన్పిస్తుంది. కొద్దిరోజుల క్రితం వరకు తెలంగాణ మరణాల రేటు 2.14శాతంగా ఉండగా ప్రస్తుతం 1.10శాతానికి తగ్గింది.

    ఒక్కసారిగా మారిన కేరళ రాజకీయం

    తెలంగాణలో మార్చి 2న తొలి కరోనా కేసు నమోదుకాగా ప్రస్తుతం ఆ సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. గడిచిన పదిరోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు సంఖ్యలో నమోదయ్యాయి. రాష్ట్రంలో జూన్ 29నుంచి జులై 8 మధ్య 52,163మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 15,117మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అంటే కేవలం పదిరోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. దీంతో వైరస్ తెలంగాణలో ఏమేరకు విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

    మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో టెస్టుల సంఖ్య తక్కువగా చేస్తున్నారు. టెస్టులు ఎక్కువగా చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణలో జూలై 9న నాటికి 1,40,755 టెస్టులు చేశారు. మన పక్కా రాష్ట్రం ఏపీ కరోనా టెస్టుల సంఖ్యలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ చివరి స్థానంలో ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో 2.96 లక్షలు, ఒడిశా 3.02లక్షలు, ఛత్తీస్‌గఢ్ 1.91లక్షలు, జార్ఖండ్ 1.61లక్షల టెస్టులతో మనకంటే మెరుగ్గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా వెల్లడవుతోంది.

    కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?

    తెలంగాణలో ప్రతీ పదిలక్షల మందిలో 3,430మందికి కోవిడ్ టెస్టులు చేస్తుండగా పాజిటివ్ రేటు 21.91శాతంగా నమోదవుతోంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు ఉన్న మహారాష్ట్రలో ప్రతీ మిలియన్ జనాభాలో 9,564మంది టెస్టులు చేస్తుండగా పాజిటివ్ రేటు18.73గా నమోదవుతోంది. ఢిల్లీలో పది లక్షల మందిలో 35,993మందికి టెస్టులు చేస్తుండగా 14.94శాతంగా ఉంది. ఏపీలో పది లక్షల మందిలో 20,498మందికి టెస్టులు చేస్తుండటా పాజిటివ్ రేటు 2.8 శాతంగా నమోదవుతోంది. తెలంగాణలో రోజుకు సగటున 1800కిపైగా కేసులు నమోదవుతూ పాజిటివ్ రేటులో దేశంలోనే టాప్ ప్లేసులోకి చేరుకుంది.

    కరోనా కేసులు రాష్ట్రంలో వేగంగా రెట్టింపు అవుతున్నప్పటికీ తెలంగాణవాసులకు ఒక అంశం ఊరటనిస్తోంది. జాతీయ స్థాయి మరణాల రేటుతో పోల్చుకుంటే తెలంగాణలో చాలా తక్కువగా నమోదవుతున్నాయి. జాతీయ స్థాయిలో కరోనా మరణాల రేటు 3.02శాతం ఉండగా రాష్ట్రంలో 1.10శాతంగా ఉంది. కొద్దిరోజుల క్రితం వరకు 2.14 శాతంగా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 1.10శాతానికి తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం సఫలమైంది. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు సంఖ్య పెరిగిపోతుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    రాష్ట్రంలో కేసుల సంఖ్య కేవలం తొమ్మిదిరోజుల వ్యవధిలో రెట్టింపు అవుతుండటం గమనార్హం. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కరోనా కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది.