ఈఎస్‌ఐ స్కాం.. భుజాలు తడుముకుంటున్న s/o పితాని!

ఇఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి కుమారుడు, ఆయన పీఎస్ హైకోర్టు లో బెయిల్ పిటీషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అసలు స్కామ్ జరగలేదని, స్కామ్ తో మంత్రులకు సంబంధం లేదని టీడీపీ నేతలు రకరకాల వాదనలు వినిపించారు. తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు, వ్యక్తి గత కార్యదర్శి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనే విషయం ఇప్పుడు అందరిని వేధిస్తోంది. ఏ తప్పు […]

Written By: Neelambaram, Updated On : July 10, 2020 6:35 pm
Follow us on


ఇఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి కుమారుడు, ఆయన పీఎస్ హైకోర్టు లో బెయిల్ పిటీషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అసలు స్కామ్ జరగలేదని, స్కామ్ తో మంత్రులకు సంబంధం లేదని టీడీపీ నేతలు రకరకాల వాదనలు వినిపించారు. తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు, వ్యక్తి గత కార్యదర్శి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనే విషయం ఇప్పుడు అందరిని వేధిస్తోంది. ఏ తప్పు చేయకపోతే బెయిల్ ఎందుకు దాఖలు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒక్కసారిగా మారిన కేరళ రాజకీయం

ఇఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు, అధికారులతోపాటు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ను అరెస్టు చేస్తారని వాదనలు వినిపించాయి. అయితే అచ్చెన్నాయుడు తప్ప ఇతర రాజకీయ నాయకుల పేర్లు చార్జిషీట్ లో లేవని అప్పట్లో ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పితాని సురేష్, మాజీ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ లు ఇఎస్ఐ స్కామ్ కు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

చంద్రబాబు 2018లో మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన సమయంలో అచ్చెన్నాయుడు వద్ద ఉన్న కార్మిక శాఖను పితాని సత్యనారాయణకు అప్పగించారు. అచ్చెన్నాయుడు వద్ద ప్రారంభమైన ఈ కుంభకోనాన్ని తరువాత మంత్రి పితాని ఆధ్వర్యంలో ఆయన కుమారుడు, పీఎస్ జోక్యంతో ముందుకు నడిపించారనేది స్పష్టం అవుతుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో నాకు, నా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి పితాని గతంలో వెల్లడించారు.

కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?

ఇఎస్ఐ స్కామ్ విచారణలో భాగంగా మరి కొందరు టీడీపీ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో మాజీ సీఎం చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. అచ్చెన్నాయుడు విచారణలో లోకేష్ పేరు ప్రస్తావించకపోవడంతో ప్రస్తుతానికి బయట పడ్డా భవిష్యత్తులో లోకేష్ కు ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి తలెత్తితే లోకేష్ ముందస్తు బైయిల్ కు అప్లయ్ చేయాల్సి వస్తుంది. భవిష్యత్తు లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.