https://oktelugu.com/

ఇక చాల్లే.. విదేశీ చదువులు ఇంటికి రండి!

ఉన్నత చదువులు చదివి మంచి మంచి జాబులు చేస్తూ.. లక్షలు గడించి, విలాసవంతమైన బ్రతుకు, జీవితాన్ని రంగుల మయం చేసుకోవాలనే ఆలోచన, తల్లిదండ్రులకు వృధాప్యంలో తోడు నీడగా ఉండాలని.. కోటి ఆశలతో, ఆశయాలతో విదేశాలకు వెళ్లిన యువత పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారింది. వారి విదేశీ చదువుల కోసం లక్షల లక్షలు అప్పులు చేసినా తల్లిదండ్రుల స్థితి ఇప్పుడు అంధకారంగా మారింది. అయితే పై చదువుల కోసం విదేశాల్లో ఇరుక్కుపోయిన తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2020 / 11:22 AM IST
    Follow us on

    ఉన్నత చదువులు చదివి మంచి మంచి జాబులు చేస్తూ.. లక్షలు గడించి, విలాసవంతమైన బ్రతుకు, జీవితాన్ని రంగుల మయం చేసుకోవాలనే ఆలోచన, తల్లిదండ్రులకు వృధాప్యంలో తోడు నీడగా ఉండాలని.. కోటి ఆశలతో, ఆశయాలతో విదేశాలకు వెళ్లిన యువత పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారింది. వారి విదేశీ చదువుల కోసం లక్షల లక్షలు అప్పులు చేసినా తల్లిదండ్రుల స్థితి ఇప్పుడు అంధకారంగా మారింది.

    అయితే పై చదువుల కోసం విదేశాల్లో ఇరుక్కుపోయిన తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అమెరికాలోని ఏపీ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఏపీ సీఎంఓ అధికారులు ఇప్పటికే ఓవర్సిస్‌ విభాగం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కుమార్‌ అన్నవరపుతో అక్కడి పరిస్థితిపై చ‌ర్చించారు.  ఆన్‌ లైన్‌ కోర్సులు అభ్యసిస్తున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో తెలుగు విద్యార్థుల్లోనూ అయోమ‌య స్థితి నెల‌కొంది.

    కరోనా వైరస్‌ నేపథ్యంలో అమెరికాలోని యూనివర్సిటీలు ముందు జాగ్రత్తగా తమ కోర్సులను పూర్తిగా ఆన్‌ లైన్‌ మోడ్‌ లోకి మార్పు చేశాయి. ఈ తరుణంలో ఇతర దేశాల విద్యార్థులు వారి వారి దేశాలకు వెళ్లి పోవాలని యునైటెడ్‌ స్టేట్స్‌ ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) ఇటీవల ఒక ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం అయ్యే వచ్చే విద్యా సంవత్సరం వరకు వీరికి సమయం ఇచ్చింది.

    అమెరికాలో తెలుగు విద్యార్థులు 47 వేల మంది చదువుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వారు 26 వేల మంది ఉన్నారు. వీరి పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూఎస్‌లోని ఏపీ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ విభాగాన్ని వారికి అండగా ఉండాలని ఆదేశించింది.  జార్జియాటెక్, క్లెమ్స్‌న్‌ స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఆస్టిన్, టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం కాలేజీ స్టేషన్, లూసియానా స్టేట్‌ యూనివర్సిటీ, సదరన్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీ అలబామా, లామర్‌ వర్సిటీ, డ్యూక్‌ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా, ఎమోరీ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌ జార్జియా, జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్‌ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ డెంటన్, యూనివర్సిటీ ఆఫ్‌ కార్పస్‌ క్రిస్టి, కింగ్స్‌విల్లే వర్సిటీ తదితరాల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.

    యూఎస్‌ లోని వివిధ వర్సిటీల్లో చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు

    దేశం                     విద్యార్థులు
    చైనా                      3,69,548
    ఇండియా             2,02,014
    సౌత్‌కొరియా         52,250
    సౌదీ అరేబియా   37,080
    కెనడా                   26,112
    వియత్నాం          24,392
    తైవాన్‌                   23,369
    జపాన్‌                   18,105