తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారైంది. మే 17 నుంచి పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అకడమిక్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. కోవిడ్ కారణంగా 11 ప్రశ్నపత్రాలకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించనుంది.
Also Read: ఫీ‘జులుం’పై సర్కార్ సీరియస్
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్నందున.. పని దినాలు, బోధన, పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ తదితర అంశాలతో ప్రతిపాదిత క్యాలెండర్‌ను తెలంగాణ సర్కార్ ఆమోదం కోసం పంపించింది. ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: కరోనాపై పని చేయని వ్యాక్సిన్.. 12,000 మందికి పాజిటివ్..?
అయితే ఇందులో 9, 10 తరగతులకు మాత్రమే అకడమిక్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మిగతా తరగతుల విషయాన్ని ప్రస్తావించలేదు. ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ 1 నుంచి 8 తరగతు లకు ప్రత్యక్ష బోధన కుదరకపోతే ఆన్‌లైన్/డిజిటల్ విధానంలోనే బోధనను కొనసాగించి, విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్