తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీకి ఎంత ఊపు వచ్చిందో.. ఇప్పుడు ఏపీలోనూ సోము వీర్రాజు చేతికి పగ్గాలు వచ్చాక పార్టీ దూసుకెళ్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష పాత్రను ఇప్పుడు బీజేపీనే పోషిస్తోంది అక్కడ. ఇందుకు కారణం సోము వీర్రాజు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నారు. ప్రజల మధ్యకు వచ్చి పోరాడుతున్నారు. ధర్నాలు.. ముట్టడిలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
Also Read: ఫీ‘జులుం’పై సర్కార్ సీరియస్
అందుకే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీని అధికారంలోకి తెస్తామని పదేపదే చెబుతూనే ఉన్నారు. ఇదంతా సాధ్యపడాలంటే ప్రధానంగా పార్టీలో ఔట్ డేటెడ్ నాయకులను పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య ఎక్కువ. ప్రస్తుతం సోము వీర్రాజు దృష్టి అంతా తెలంగాణపై ఉంది. అక్కడ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించే దిశగా అడుగులు వేసి సక్సె స్ అయ్యారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లోనూ అనూహ్య రీతిలో విజయం దక్కించుకుని నాలుగు స్థానాల నుంచి 48 స్థానాలకు ఎగబాకేలా పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు.
దీనిని నిశితంగా గమనించిన సోము వీర్రాజు.. ఏపీలోనూ ఇదే మంత్రంతో ముందుకు సాగాలని అనుకుంటున్నారు. వీరిద్దరూ ఒకేసారి ఏపీ, తెలంగాణకు అధ్యక్షులుగా నియమితులు కావడంతో ఇప్పుడు సహజంగానే వీరు ఎంత మేరకు సక్సెస్ అయ్యారన్న దానిపై కంపేరిజన్లు ఎక్కువ అయ్యాయి. సోము వీర్రాజు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వంపై అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. తెలంగాణకు, ఏపీకి మాత్రం చాలా తేడా ఉందని అంటున్నారు కమలం పార్టీలోని మేధావులు.
Also Read: చంద్రబాబు.. మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం?
‘అక్కడకు, ఇక్కడకు చాలా తేడా ఉంది. అక్కడ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వారు యువ నాయకుడు. దేనికైనా రెడీగా ఉన్నారు. యువతను కదిలించే అస్త్రాలు చాలానే ఉన్నాయి. కానీ.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మావోళ్లు పాత నాయకులకు వల విసురుతున్నారే తప్ప.. కొత్త యువతను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేయడం లేదు. ఉన్న ఒకరిద్దరికీ కూడా అవకాశం ఇవ్వలేదు. మేం మాట్లాడితే.. ఎక్కడ వాళ్లకు అడ్డం వస్తామో.. అని భావిస్తున్నారు. ఇక, పార్టీ ఎలా అధికారంలోకి వస్తుంది.’ అంటూ.. సీమ ప్రాంతానికి చెందిన ఓ యువ నాయకుడు చెప్పిన మాట ఇది. ఔట్ డేటెడ్ లీడర్లకు తాము కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఉన్నామని చెప్పుకునేందుకు మినహా వారితో పార్టీకి ఉపయోగం లేదు. ఇక సోము వీర్రాజు ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తే మంచిదన్న అభిప్రాయాలూ వెల్లడవుతున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్