https://oktelugu.com/

కరోనా.. తెలంగాణలో తిరగబడుతుందా?

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా చుట్టే తిరుగుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి ఇప్పుడు అందరినీ కబళిస్తోంది. ప్రజలు, ప్రభుత్వాలు ఇప్పుడు వాటితోనే పోరాడుతున్నాయి. అయితే కరోనా కాటుకు గురైతే ఇక మళ్లీ ఆ మహమ్మారి మన దరిచేరదనే కాన్ఫిడెంట్ అందరు బాధితుల్లో ఉంది. కానీ ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అవుతోంది. Also Read: సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ అవును.. తెలంగాణలో కరోనా సోకి కోలుకున్న వారిలో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2020 7:20 pm
    Follow us on


    ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా చుట్టే తిరుగుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి ఇప్పుడు అందరినీ కబళిస్తోంది. ప్రజలు, ప్రభుత్వాలు ఇప్పుడు వాటితోనే పోరాడుతున్నాయి. అయితే కరోనా కాటుకు గురైతే ఇక మళ్లీ ఆ మహమ్మారి మన దరిచేరదనే కాన్ఫిడెంట్ అందరు బాధితుల్లో ఉంది. కానీ ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అవుతోంది.

    Also Read: సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

    అవును.. తెలంగాణలో కరోనా సోకి కోలుకున్న వారిలో మళ్లీ వైరస్ తిరగబడుతుండడం కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం చోటుచేసుకోగా.. దేశంలోనూ కేసులు పునరావృతం కావడం కలకలం రేపుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకోని మళ్లీ తిరగబెట్టడంతో ఆస్పత్రిలో చేరారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తెలంగాణలోనూ తాజాగా అలాంటి కేసులు వెలుగుచూడడం విశేషం.

    తెలంగాణ ఇద్దరు వ్యక్తులు కరోనా బారిన రెండోసారి పడ్డారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 1.11 లక్షల కేసుల్లో రెండు రీఇన్ఫెక్షన్ కేసులు గుర్తించామని మంత్రి చెప్పారు. దీంతో కరోనా సోకిన వ్యక్తికి మళ్లీ వ్యాధి సోకదనే ప్రచారం వట్టి మాట అని మంత్రి వివరించారు.

    “తక్కువ యాంటీ బాడీలు ఉన్న వారు మళ్లీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది” అని ఈటల హెచ్చరించారు. తెలంగాణలో కరోనా రెండోసారి సోకే కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. రెండోసారి వచ్చే వారికి లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని తెలిపారు.
    తెలంగాణ ఇప్పటివరకు ఒక్కరోజులో అత్యధిక కేసులు బుధవారం నమోదయ్యాయి. బుధవారం 3,018 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,11,688 కు చేరాయి. గత 24 గంటల్లో మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 780 కు పెరిగింది.

    Also Read: కలిసొచ్చిన కాలం.. టీపీసీసీలో ఉత్తమ్ దే రాజ్యం

    తెలంగాణలో మరణాల రేటు 0.7-0.8 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 76-77 శాతం గా ఉంది. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని అధికారులు తెలిపారు.

    -ఎన్నం