ప్రభాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ?

ఐదేళ్ల క్రితం వరకు ప్రభాస్‌.. టాలీవుడ్‌కు మాత్రమే డార్లింగ్. బాహుబలి రిలీజయ్యాక అతను నేషనల్‌ స్టార్ గా మారిపోయాడు. అనేక భాషల్లో, అనేక దేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతగా ఆడని ‘సాహో’తో సైతం ఆహా అనిపించాడు. ఇప్పుడు వరుసగా మూడు పాన్‌ ఇండియా సినిమాలతో ముందుకు రాబోతున్న ప్రభాస్‌ స్టార్డమ్‌ అమాంతం పెరిగింది. అతని సినిమాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. వంద కోట్ల పారితోషికం.. ఐదొందల కోట్ల బడ్జెట్‌ మూవీస్‌తో అతను […]

Written By: Neelambaram, Updated On : August 26, 2020 7:06 pm
Follow us on


ఐదేళ్ల క్రితం వరకు ప్రభాస్‌.. టాలీవుడ్‌కు మాత్రమే డార్లింగ్. బాహుబలి రిలీజయ్యాక అతను నేషనల్‌ స్టార్ గా మారిపోయాడు. అనేక భాషల్లో, అనేక దేశాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతగా ఆడని ‘సాహో’తో సైతం ఆహా అనిపించాడు. ఇప్పుడు వరుసగా మూడు పాన్‌ ఇండియా సినిమాలతో ముందుకు రాబోతున్న ప్రభాస్‌ స్టార్డమ్‌ అమాంతం పెరిగింది. అతని సినిమాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. వంద కోట్ల పారితోషికం.. ఐదొందల కోట్ల బడ్జెట్‌ మూవీస్‌తో అతను బాలీవుడ్‌ బడా హీరోలను సైతం వెనక్కునెట్టేస్తున్నాడు. తానాజీ ఫేం ఓం రౌత్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్‌’ తర్వాత అతను బాలీవుడ్‌లో పాగా వేసే అవకాశం ఉంది.

Also Read: అన్నీ చేసినా.. పెద్దగా సంపాదించలేకపోయాను !

అయితే, మన డార్లింగ్‌ జోరు బాలీవుడ్‌తో ఆగేలా లేదు. అతను హాలీవుడ్‌లో అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రెబల్‌ స్టార్ సక్సెస్, ప్రోగ్రెస్‌ సంతోషంగా ఉన్న అతని పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్… హాలీవుడ్‌ స్టార్ అవడం పెద్ద కష్టమేం కాబోదని అంటున్నారు. ఆదిపురుష్‌ సినిమా గురించి రీసెంట్‌గా మాట్లాడిన ఆయన ప్రభాస్‌ను హాలీవుడ్‌ హీరోగా చూడాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు. ‘ప్రభాస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్టార్ కావడం అతనికి పెద్ద పని కాదు. సోషల్‌ ఫాంటసీ కథతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా రూపొందించాలని ఆదిపురుష్ నిర్మాతలు నిర్ణయించారు. ఈ కథ విన్న ప్రభాస్ చాలా ఇంప్రెస్‌ అయ్యాడు. నేను కూడా ఈ సినిమా కథ విన్నాను, బాగా నచ్చింది. ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా కానుంది. ఆదిపురుష్ చిత్రం భారతీయ భాషల్లోనే కాదు హాలీవుడ్‌లో కూడా విడుదల కానుంది. అయోధ్య రామాలయానికి ఇటీవలే పునాదిరాయి వేశారు. ప్రపంచం అంతా ఆ రాముడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆదిపురుష్ తెరపైకి రావడం గొప్ప విషయం’ అని కృష్ణం రాజు పేర్కొన్నారు.

Also Read: బాలయ్య బాబుకు హీరోయిన్ గా జయసుధ !

పెదనాన్న కలను నిజం చేయడం కోసమైనా ప్రభాస్‌ హాలీవుడ్‌పై కన్నేసే అవకాశం ఉంది. హాలీవుడ్ కు దగ్గరయ్యేందుకే అమెరికాలో ఓ విల్లా కొనుగోలు చేయాలని ప్రభాస్‌ భావిస్తున్నాడని సమాచారం. ప్రభాస్‌ ప్రస్తుతం రాధే శ్యామ్ లో నటిస్తున్నాడు. దాని తర్వాత నాగ్‌ అశ్విన్‌తో ఓ సైంటిఫిక్‌ థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు.