ప్రతీయేటా జూన్ నెల ఆరంభంలోనే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేది. అయితే దేశంలో కరోనా ప్రభావం విద్యాసంస్థలన్నీ మూతపడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం జూలై నెల గడుస్తున్నప్పటికీ విద్యాసంస్థలను తెరిచేందుకు ఆయా ప్రభుత్వం జంకుతున్నాయి. విద్యా సంవత్సరం ఇంకా ఆలస్యమైతే ఇబ్బందులు ఎదుర్కొక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కరోనా టైంలోనూ కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ ముందుకెళుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా కేరళ దారిలోనే నడిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూనే కేరళ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించింది. అంతేకాకుండా యథావిధి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. జూన్ 1నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఛానళ్ల ద్వారా టీవీల్లో పాఠాలు చెబుతున్నారు. వీటినే యూ ట్యూబ్లో అప్‌లోడ్ చేస్తూ ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు.
కరోనాపై పోరాటం.. హైదరాబాదీల స్వచ్చంధ లాక్ డౌన్
ఇక స్మార్ట్‌ఫోన్ లేనివారు, టీవీల్లేని వారి కోసం ప్రత్యేకంగా అంగన్‌వాడీల్లో టీవీలు పెట్టించారు. విద్యార్థుల ఇంట్లో టీవీ, స్మార్ట్ ఫోన్ లేనట్లయితే వారిని అంగవాడీలకు తీసుకొచ్చే బాధ్యతను ప్రభుత్వం స్థానిక గ్రామ సర్పంచ్ కు అప్పగించింది. స్థానిక సంస్థలను వినియోగించుకుంటూ ప్రభుత్వం విజయవంతంగా ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తోంది. కేరళ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన డీడీ యాదగిరి, టీశాట్, లోకల్ కేబుల్ ద్వారా ఆన్‌లైన్ తరగతులను నిర్వహించేందుకు విద్యాశాఖ రెడీ అవుతోంది. ఇంట్లో టీవీలు, స్మార్ట్ ఫోన్ లేనివాళ్లు స్కూల్లో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా స్కూళ్లకు ఉచితంగా టీవీలను పంపిణీ చేశారట. అదేవిధంగా ఈనెల 20నుంచి పాఠ్యపుస్తకాల పంపిణీ చేయనున్నారట. రోజుకు రెండు నుంచి మూడు గంటలు టీవీల్లో పాఠాలు చెప్పేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
కరోనా లక్షణాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతుందా?
ఈమేరకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ తరగతులపై క్లారిటీ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలకు హైకోర్టుకు విన్నవించనుంది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించనుంది. అన్ని పనులు సజావుగా జరిగితే మరో వారం, పది రోజుల్లో ఆన్ లైన్ క్లాసులు తెలంగాణలో ప్రారంభమవడం ఖాయంగా కన్పిస్తోంది.