రంగంలోకి కేటీఆర్.. కరోనా విమర్శలకు చెక్

తెలంగాణ కరోనా పంజా విసురుతుండటంతో టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. కరోనాపై ముందుండి పోరాడాల్సిన సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫౌంహౌజ్ నుంచి పాలన సాగిస్తున్నారని విపక్షాలు మండిపడుతోన్నాయి. సీఎం కేసీఆర్ కరోనాను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. విపక్షాలతోపాటు ప్రజల నుంచి కూడా ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం చెబుతూ ఆ పార్టీలను డిఫెన్స్ లోకి నెట్టారు. కరోనాపై పోరాటం.. […]

Written By: Neelambaram, Updated On : July 13, 2020 7:08 pm
Follow us on


తెలంగాణ కరోనా పంజా విసురుతుండటంతో టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. కరోనాపై ముందుండి పోరాడాల్సిన సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫౌంహౌజ్ నుంచి పాలన సాగిస్తున్నారని విపక్షాలు మండిపడుతోన్నాయి. సీఎం కేసీఆర్ కరోనాను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. విపక్షాలతోపాటు ప్రజల నుంచి కూడా ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం చెబుతూ ఆ పార్టీలను డిఫెన్స్ లోకి నెట్టారు.

కరోనాపై పోరాటం.. హైదరాబాదీల స్వచ్చంధ లాక్ డౌన్

దేశం, ప్రపంచమంతటా కరోనా లాంటి విపత్కర పరిస్థితులున్నాయని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి సమయంలోనూ కొందరు నాయకులు, వారి అనుచరులు వెర్రీ రాజకీయాలకు పాల్పడుతుండటం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షాలకు ధీటుగా జవాబిచ్చే స్థితిలోనే ఉన్నారని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే సమయం వృథా అవుతుందన్నారు. ఇది ఏ ఒక్కరికి వచ్చిన సమస్య కాదని ప్రపంచమంతటా ఈ సమస్య ఉందని విమర్శలు చేసే నేతలు గుర్తించుకోవాలన్నారు.

ప్రపంచంలోనే ఇండియా కరోనా కేసుల్లో మూడోస్థానంలో ఉందని తెలిపారు. కరోనా కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిపోతున్నాయని తెలిపారు. దేశంలో కరోనా కేసులను అరికట్టడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారా? అంటూ ప్రతిపక్షాలను ఢిపెన్స్ లో పడేశారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అర్ధరాత్రి ఓ రోగి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి గాంధీలో చికిత్స చేయించారని గుర్తుచేశారు. రాజేందర్ టైంతో పోటీపడుతూ పని చేస్తున్నారని అభినందించారు. ప్రభుత్వ పనితీరు వల్లే తెలంగాణలో రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదవుతుందని తెలిపారు.

తెలంగాణ యంత్రాంగం, వైద్య సిబ్బంది నిరంతరం కరోనాపై పోరాడుతున్నారని తెలిపారు. టెస్టుల సంఖ్య తక్కువగా చేసినప్పటికీ కరోనా రికవరీ తెలంగాణలో ముందంజలో ఉందన్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్షం చేస్తున్నారని ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. గాంధీలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చాలామంది కోలుకొని ఇంటికి వెళ్లారని చెప్పారు. 60ఏళ్లు పైబడి, చిన్నారులపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని.. అలాంటిది గాంధీలో ఏకంగా 90మందికి పైగా వృద్ధులు, 28రోజుల వయస్సున్న శిశువును కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు.

కరోనా లక్షణాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతుందా?

తెలంగాణలో రికవరీ రేటు 98శాతం ఉందని, మరణాలరేటు కేవలం రెండు శాతంగా ఉందన్నారు. జాతీయ సగటుతో పొలిస్తే తెలంగాణలో మరణాల రేటు తక్కువగా ఉందని తెలిపారు. విపక్షాలు రికవరీ రేటు విస్మరించి కేవలం మరణాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రికవరీ రేటుపై మీడియా, ప్రతిపక్షాలు దృష్టిపెడితే అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రభుత్వానికి మంచిపేరు రావొద్దనే దురుద్దేశ్యంతోనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయంటూ కరోనా విమర్శలకు కేటీఆర్ తనదైన శైలిలో చెక్ పెట్టారు.