https://oktelugu.com/

బాలీవుడ్‌ను వదలని విషాదాలు… ఇద్దరు నటులు మృతి

బాలీవుడ్‌కు ఈ ఏడాది ఏదీ కలిసిరావడం లేదు. కరోనా కారణంగా సినిమాలు, షూటింగ్స్‌ ఆగిపోయి ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం సహా పలువురు కరోనా బారిన పడ్డారు. మరోవైపు సినీ ప్రముఖుల వరుస మరణాలు బాలీవుడ్‌ను కుంగదీస్తున్నాయి. రిషీ కపూర్, ఇర్ఫాన్‌ ఖాన్, సరోజ్‌ ఖాన్, వాజిద్‌ ఖాన్, జగదీప్‌ మరణాలు, నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా మరో ఇద్దరు యువ నటులు ఒకే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 13, 2020 / 06:41 PM IST
    Follow us on


    బాలీవుడ్‌కు ఈ ఏడాది ఏదీ కలిసిరావడం లేదు. కరోనా కారణంగా సినిమాలు, షూటింగ్స్‌ ఆగిపోయి ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం సహా పలువురు కరోనా బారిన పడ్డారు. మరోవైపు సినీ ప్రముఖుల వరుస మరణాలు బాలీవుడ్‌ను కుంగదీస్తున్నాయి. రిషీ కపూర్, ఇర్ఫాన్‌ ఖాన్, సరోజ్‌ ఖాన్, వాజిద్‌ ఖాన్, జగదీప్‌ మరణాలు, నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా మరో ఇద్దరు యువ నటులు ఒకే రోజు అకాల మరణం పొందారు. బాలీవుడ్‌ సినీ, టీవీ నటుడు రాజన్‌ సెహగల్‌ (36), ప్రముఖ మోడల్‌, నటి, గాయని అయిన దివ్య చోక్సీ (29) ఆదివారం కన్నుమూశారు. ఇద్దరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజన్‌ చండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుల్లితెర నుంచి బాలీవుడ్‌లో అడుగు పెట్టిన నటుడిగా ఆయనకు మంచి పేరుంది. బుల్లితెరపై క్రైమ్‌ పెట్రోల్, సావధాన్‌ ఇండియా, తుమ్‌ దేనా సాత్‌ మేరా వంటి కార్యక్రమాలతో ద్వారా ప్రేక్షకులకు చేరువైన రాజన్.. ఐశ్వర్యా రాయ్, రణదీప్‌ హుడా నటించిన ‘సరబ్‌జిత్‌’ చిత్రంతో ఓ కీలక పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై, ‘ఫోర్స్’ , కర్మ’ వంటి చిత్రాలతో పాటు పంజాబీ చిత్రాల్లోనూ నటించాడు.

    బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి

    మరోవైపు నటిగా, గాయనిగా ఫేమ్‌ సాధించిన దివ్య చోక్సి గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఆదివారం ఆమె తుది శ్వాస విడిచినట్టు దివ్య బంధువు సౌమ్యా అమిష్‌ వర్మ వెల్లడించారు. 2011 సంవత్సరంలో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొన్న దివ్య 2016 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఫేమ్ సాహిల్ ఆనంద్‌తో కలిసి ‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ సినిమాలో నటించింది. ఆపై పలు యాడ్ ఫిల్మ్స్, టెలివిజన్ షోస్‌లో యాక్ట్ చేసింది. ‘పాటియలే డి క్వీన్’ సాంగ్‌తో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తనను తాను క్యాన్సర్ సర్వైవర్‌గా గర్వంగా చెప్పుకున్న దివ్య మరణానికి కొన్ని గంటల ముందు సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ పెట్టడం గమనార్హం. ‘చాన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ నెలల తరబడి మరణశయ్యపై ఉన్నాను. బాధ లేని మరో జన్మలో కలుద్దాం. ఇక సెలవంటూ’ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో తుది వీడ్కోలు చెప్పడం మరింత బాధాకరం.