Telangana Politics: బీజేపీ, కాంగ్రెస్ లకు చెక్ పెట్టే కేసీఆర్ ప్లాన్ ఇదీ

Telangana Politics: తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఓ జాతీయ పార్టీ బీజేపీ దూసుకుపోతుండడంతో అధికార పార్టీ తలనొప్పిగా మారుతోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో టీఆర్ఎస్ దీనిపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 17న నిర్మల్ లో బీజేపీ నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో గులాబీ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. మరోవైపు గజ్వేల్ లో రేవంత్ రెడ్డి నిర్వహించిన సభ […]

Written By: Srinivas, Updated On : September 19, 2021 2:46 pm
Follow us on

Telangana Politics: తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఓ జాతీయ పార్టీ బీజేపీ దూసుకుపోతుండడంతో అధికార పార్టీ తలనొప్పిగా మారుతోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో టీఆర్ఎస్ దీనిపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 17న నిర్మల్ లో బీజేపీ నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో గులాబీ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. మరోవైపు గజ్వేల్ లో రేవంత్ రెడ్డి నిర్వహించిన సభ కూడా విజయవంతం కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో రెండు పార్టీలు ప్రచారంలో ముందుండడంతో టీఆర్ఎస్ పార్టీకి కంటకంగా మారింది. రాబోయే ఎన్నికల్లో తమకు ఎదురొడ్డే సత్తా కూడగట్టుకుంటున్నాయని ఆలోచిస్తోంది. వీటికి దీటుగా తాము కూడా సత్తా చాటాలని భావిస్తోంది. వచ్చే నెలలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కు తీసిపోని విధంగా సభను సక్సెస్ చేయాలని చూస్తోంది.

రాష్ర్టంలో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా దూసుకుపోవడంతో టీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. మరోవైపు షర్మిల, తీన్మార్ మల్లన్న వ్యవహారాలు పార్టీకి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఈ పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడుతోంది. ఎలాగైనా వాటికి సమాధానం చెప్పాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వీటిని తలదన్నే విధంగా సభ నిర్వహించాలని ఉవ్విళ్లూరుతోంది.

నిర్మల్, గజ్వేల్ సభలు విజయవంతం కావడంతో టీఆర్ఎస్ పార్టీ అక్కడికి చేరుకున్న వారి వివరాలు సేకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.వీటిపై నివేదిక రూపొందించి కేసీఆర్ కు సూచించనున్నట్లు సమాచారం. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ లను ఎదుర్కొనే విధంగా తమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.