https://oktelugu.com/

Tollywood Updates (19.09.2021): టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ !

Tollywood Updates (19.09.2021): నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. నేషనల్ స్టార్ ప్రభాస్ మనసు చాలా మంచిది అని, అవసరంలో ఉన్నవారికి సాయం చేయడానికి ప్రభాస్ ఎంత దూరం అయినా వెళ్తాడని, ఇప్పటికే కొంతమంది నటులు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే అది నిజమే అని మరో రుజువు అయింది. శోభిత అనే అమ్మాయి క్యాన్సర్‌ తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రభాస్‌ అభిమాని. అయితే […]

Written By:
  • admin
  • , Updated On : September 19, 2021 / 03:00 PM IST
    Follow us on

    Tollywood Updates (19.09.2021): నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. నేషనల్ స్టార్ ప్రభాస్ మనసు చాలా మంచిది అని, అవసరంలో ఉన్నవారికి సాయం చేయడానికి ప్రభాస్ ఎంత దూరం అయినా వెళ్తాడని, ఇప్పటికే కొంతమంది నటులు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే అది నిజమే అని మరో రుజువు అయింది. శోభిత అనే అమ్మాయి క్యాన్సర్‌ తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రభాస్‌ అభిమాని. అయితే ఆమె గురించి తెలుసుకున్న ప్రభాస్, ఆమెకు వీడియో కాల్‌ చేసి ఆమెతో మాట్లాడి ఆమెను సంతోష పెట్టారు. శోభిత త్వరగా కోలుకోవాలని ప్రభాస్ ఆకాంక్షించాడు.

    వివాదాల హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ మొత్తానికి తన సహజ శైలిని మరోసారి విజయవంతంగా ప్రదర్శించింది. ఆమె మళ్ళీ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం పై విరుచుకుపడింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను తెర‌వకుండా సినీరంగంపై వివక్ష చూపుతోందని కంగనా తన స్టైల్ లో విమర్శలు గుప్పించింది. కంగ‌నా ర‌నౌత్ న‌టించిన‌ ‘తలైవి’ సినిమా రిలీజ్ విషయంలో ఆమె బాగా ఫీల్ అయినట్లు ఉంది.

    రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ ఖాన్‌ హీరోగా రాబోతున్న సినిమాలో యంగ్ బ్యూటీ తాప్సీ హీరోయిన్‌ గా నటించబోతుంది. ఎప్పట్నుంచో ఈ వార్త ప్రచారంలో ఉంది. అయితే, ఈ వార్తలో వాస్తవం ఉంది అని తాజాగా ఆమె సన్నిహితులు నుంచి సమాచారం అందుతుంది. ఈ సినిమా ఒక సోషల్‌ డ్రామాగా ఉండబోతుందట.

    టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హిట్ సినిమా “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ బంగార్రాజు కొత్త షెడ్యూలు కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక ప్రత్యేక సెట్ వేస్తున్నారు. ఈ సెట్ స్వర్గం నేపథ్యంలో ఉంటుందట. ఈ సెట్ చాలా ప్రత్యేకమైనది అని తెలుస్తోంది. తోట తరుణీ ఈ సెట్ ను డిజైన్ చేశారు.