Nityananda Swami: నిత్యానంద.. పరిచయం అక్కరలేని పేరు ఇది. తనకు తాను దేవుడిగా ప్రకటించుని మహిళలపై లైంగికదాడికి పాల్పడిన సదరు స్వామీజీ ప్రస్తుతం దేశం విడిచి పారిపోయాడు. ఈక్వెడార్ సమీపంలో ఒక దీవిని కొనుగోలు చేసి కైలాస పేరుతో ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు. ప్రత్యేక కరెన్సీ కూడా ఉందటూ ప్రచారం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్న ఈ స్వామీజీ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పట్లో చనిపోయారన్న వార్తలు కూడా వచ్చాయి. తాజాగా తెలుగు, తమిళ హీరోయిన్ ప్రియా ఆనంద్ నిత్యానంద స్వామి గురించి చేసిన కామెంట్స్‌తో ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు.

పెళ్లిచేసుకోవాలని ఉందట…
గతంలో లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద స్వామిని కర్నాటక పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పర్చిన సమయంలో స్వామీజి తాను నపుంసకుడిని అని ప్రకటించారు. కేసు నుంచి తప్పించుకోవడానికే ఇలా చెప్పి ఉంటారని ప్రచారం జరిగింది. పోలీసులు కూడా అతడికి సామర్థ్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. తర్వాత బెయిల్‌పై విడుదలైన ఆయన తర్వాత ఆశ్రమం మూసివేసి దేశం విడిచిపారిపోయారు. అప్పట్లో హీరోయిన్ రంజిత స్వామీజి ఆశ్రమంలో కనిపించారు. స్వామికి సేవ చేస్తున్న వీడియోలు, అతడితో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి.
Also Read: Anasuya Bharadwaj: బుల్లితెరకు బైబై.. వెండితెరకే అనసూయ ప్రాధాన్యం!
ఇది అప్పట్లో సంచలనం అయింది. తాజాగా మరో హీరోయిన్ స్వామీజీ మోజులో పడ్డారు. ప్రియా ఆనంద్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘నాకు నిత్యానంద స్వామి అంటే ఎంతో ఇష్టం.. ఆయన దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టి అందరూ ఆయనను ఇష్టపడతారు’ అని పేర్కొంంది. అంతేకాదు పెళ్లి చేసుకుంటే అతన్ని చేసుకుంటానని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియా ఆనంద్ ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాల్లో నటించి అలరించిన తమిళనటి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా చేశారు. రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ ‘లీడర్’( 2010) చిత్రం మంచి కథ, కథనంతో వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘రామ రామ కృష్ణకృష్ణ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది. కానీ అనుకున్నంతగా అలరించలేదు. సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన ‘180’ , శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘కో అంటే కోటి’ వంటి చిత్రాల్లో నటించింది ప్రియా ఆనంద్. అయితే ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో ఆమెకు రావాల్సినంత గుర్తుంపు రాలేదు.

తమిళంలో వరుస సినిమాలు..
తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళంలో మాత్రం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియా ఆనంద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని ఉందని హీరోయిన్ ప్రియా ఆనంద్ అనడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. వివాదాస్పద స్వామిజీ నిత్యానందపై తాజాగా మరో హీరోయిన్ మనసు పారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read:Ponniyin Selvan 1: ‘పొన్నియిన్ సెల్వన్ 1’లో పాత్రలు, వాటి చరిత్రలు ఇవే !
[…] […]