KCR Vs Governor Tamilisai: తెగేదాకా లాగితే ఏదైనా తెగుతుంది.. ఇప్పుడు తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది.. మొన్న పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత తమిళసై ట్రాప్ లో భారత రాష్ట్ర సమితి నాయకులు పడ్డారని స్పష్టమవుతున్నది.. వాస్తవానికి మొదట్లో గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి టర్మ్స్ బాగానే ఉండేవి.. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య అన్నాచెల్లెళ్ల సంబంధాలు ఉండేవి.. కాలం అంతా ఓకే తీరుగా ఉండదన్నట్టు.. ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వ్యవహారం లో గవర్నర్ ప్రశ్నించారో అప్పుడే విభేదాలు మొదలయ్యాయి.. క్రమక్రమంగా విస్తరించుకుంటూ వెళ్లాయి.. దీంతో ఏకంగా దూషణలు చేసుకునే స్థాయికి వెళ్ళింది.

సర్కార్ వ్యవహారంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.. మొన్న జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఫామ్ హౌస్ లు కాదు.. ప్రజలకు ఫామ్, హౌస్ కావాలని గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరోక్షంగా ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. అంతే కాదు ప్రభుత్వ విహార శైలిపై చివరికి టీవీ డిబేట్లకూ వెళ్తున్నారు. బిల్లులను తొక్కి పెడుతున్నారు.. సందేహాల నివృత్తి కోసం తన ఆఫీస్ కి మంత్రులను, ఇతర అధికారులను పిలిపించుకుంటున్నారు..
ఇక గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం గా ఉంది.. కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు ఆమెపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. అధికార పత్రికలో అయితే పేజీలకు పేజీల వార్తలు అచ్చవుతున్నాయి.. టీ న్యూస్ లో అయితే గవర్నర్ కు వ్యతిరేకంగా డిబేట్లు కూడా సాగుతున్నాయి.

అయితే ప్రభుత్వం గవర్నర్ ను అంటే ఎక్కువ ఇబ్బంది పెడుతోందని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది.. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలలో పస లేదని స్పష్టంగా అర్థమవుతున్నది.. పైగా గవర్నర్ మాతృమూర్తి చనిపోయినప్పుడు ప్రభుత్వం హెలికాప్టర్ సదుపాయం కల్పించలేదు.. ఇతర జిల్లాలో పర్యటించినప్పుడు ఇదే తీరుగా వ్యవహరించింది.. మేడారం వెళ్తే ప్రోటోకాల్ కూడా పాటించలేదు.. ఆ మధ్య భద్రాద్రి జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు… జిల్లా అధికారులను సెలవులో పంపించింది.. ఇవన్నీ అధికార పత్రికలో ప్రచురితం కాక పోయినంతమాత్రాన ప్రజలకు తెలియదు అనుకోవడం పొరపాటు.. ఇప్పటికీ టెక్నికల్ గా గవర్నరే ప్రభుత్వానికి అధిపతి. ఆ విషయం తెలియని భారత రాష్ట్ర సమితి నాయకులు పాడి కౌశిక్ లాగా ఎగిరిఎగిరి పడుతున్నారు.. కేంద్రం ఇప్పుడు గవర్నర్ నివేదిక ఆధారంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.. అయితే గవర్నర్ తాను ఇచ్చే నివేదికల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న వ్యవహారాలను అందులో పేర్కొనే అవకాశం లేకపోలేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఈ కారణాలను చూపి ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనుకున్నా లేకపోతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అయినా రాష్ట్రపతి పాలన విధిస్తే చాలా ఇబ్బంది పడతారు.. బహుశా ఆ ప్లాన్ కోసమే గవర్నర్ తో కేంద్రంలో పెద్దలు గవర్నర్ తో ఇలా రచ్చ చేస్తున్నారేమో గాని… ఇదే నిజమైతే భారత రాష్ట్ర సమితి నాయకులు బిజెపి ట్రాప్ లో పడినట్టేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి