Pawan Kalyan- Sujeeth Movie Story: పవన్ కళ్యాణ్ లైనప్ లో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #OG ..రన్ రాజా రన్ మరియు సాహూ వంటి ప్రాజెక్ట్స్ తీసిన సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు..సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలుసు..ఆయనతో సినిమా తియ్యాలని కోరికతోనే ఇండస్ట్రీ కి వచ్చి డైరెక్టర్ అయ్యాడు.

మొత్తానికి ఆ కలని నెరవేర్చుకున్నాడు..#RRR వంటి అద్భుతాన్ని వెండితెర మీద తెరకెక్కించిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నాడు..ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ నెల 30 వ తారీఖున జరగనుంది..ఈ సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఫిలిం నగర్ నుండి లీక్ అయిన కొన్ని విశేషాలను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
అభిమానులకు షాక్ కి గురి చేస్తున్న విషయం ఏమిటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కేవలం 45 నుండి 50 నిముషాలు మాత్రమే కనిపిస్తాడు అంట..గత ఏడాది విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ సినిమా మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది కదా..ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కమల్ హాసన్ కనిపించేది చాలా తక్కువ సేపే..కానీ కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది..అదే తరహాలో #OG స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది..ఇందులో ఫస్ట్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ కోసం విలన్స్ వెతుకుతూ ఉంటారు.

సమాంతరంగా ఫ్లాష్ బ్యాక్ కూడా నడుస్తూ ఉంటుంది..ఇంటర్వెల్ నుండి భారీ బిల్డప్ తో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ ఉంటుంది..గ్యాంగ్ స్టర్ మరియు మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ సుజీత్..పవన్ కళ్యాణ్ ఈ కథ విన్న తర్వాత ఎంతో ఆనందించాడట..ఆయన కెరీర్ లో ఇదే బెస్ట్ మూవీ అవుతుంది అని సుజీత్ కి చెప్పాడట..చూడాలి మరి ఈ హైప్ ని ఈ చిత్రం మ్యాచ్ చేస్తుందో లేదో అనేది.