Telangana Police: తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బలం పోలీస్ వ్యవస్థ. ముఖ్యంత్రిగా బాధ్యతలు చేపట్టాక కె.చంద్రశేఖర్‌రావు పోలీసింగ్ బలోపేతంపైనే దృష్టిపెట్టారు. నారా చంద్రబాబు నాయుడి శిష్యుడిగగా గుర్తింపు ఉన్న కేసీఆర్ చంద్రబాబు లాగానే దూరదృష్టితో ఆలోచించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు పోలీసింగ్ పాలకులకు అండగా నిలిచేలా తయారు చేశారు కేసీఆర్. ప్రతిపక్షాలను అణచి వేయడంలో, ప్రభుత్వ వ్యతిరేకులపై కేసులు పెట్టడంలో, ప్రభుత్వ వ్యతిరేకులు రోడ్లపైకి రాకుండా చేయడంలో కేసీఆర్ సఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వరకు పోలీసులు సలాం కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి బలంగా మారిన పోలీసులే ఇప్పుడు బలహీనతగా మారుతోంది. ఒత్తిడితో చేసే పనులతో వాస్తవాలను బయటపెడుతున్నారు. తాము ఇరుకున పడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నారు. ఇందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసు, తాజాగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలు చక్కటి ఉదాహరణ. హడావుడి ప్రెస్‌మీట్‌లతో, అధికార పార్టీ ఒత్తిడితో పెడుతున్న మీడియా సమావేశంలలో ఐపీఎస్‌లు కూడా తడబడుతున్నారు. విలేకరుల ప్రశ్నలకు సమాధానం చేప్పలేక దాటవేయాల్సిన పరిస్థితి.

మైనర్ బాలలిక గ్యాంగ్ రేప్ ఆధారాలు బహిర్గంతం
పబ్ గ్యాంగ్ రేప్ కేసులో బాలికపై అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. అవి బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావుకు చేరాయి. ఎమ్మెల్యే కుమారుడ్ని పోలీసులు అధికారికంగా తప్పించేశారు. ఆయన రేప్ సమయంలో లేడని క్లీన్ చిట్ ఇచ్చేశారు. కానీ రఘునందన్ రావు .. ఆ బాలికను ఎమ్మెల్యే కొడుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. ఇవి పోలీసుల దగ్గర నుంచే వెళ్లాయని ప్రభుత్వ వర్గాలు నమ్ముతున్నాయి. ఎందుకంటే.. నిందితులను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఉన్నాయి అవి. అవే రఘునందన్‌రావుకు చేరాయి.
Also Read: Krishnapatnam Thermal Power Plant: కృష్ణపట్నం థర్మల్ కేంద్ర షట్ డౌన్ వెనుక కుట్ర ఇదా?
దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఉలిక్కి పడ్డారు. వెంటనే ఎస్బీ, లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సమావేశమై నిందితుల వీడియోలు, ఫొటోలు ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ఎలా చేరాయన్నదానిపై ఆరా తీశారు. ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు కన్నా ఆధారాలు బయటకు వెళ్లడమే ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆగ్రహం తెప్పిస్తోంది. ఎమ్మెల్యే కొడుకుని ఇప్పటికే దుబాయ్ పంపించేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో వీడియోలు.. ఫొటోలు లీక్ చేయడం ద్వారా బీజేపీ అడ్వాంటేజ్ సాధించింది. దీంతో అటు ప్రజల్లో మాత్రమే కాదు.. ప్రభుత్వ వ్యవస్థల్లోనూ తమకు పట్టు చిక్కిందనే ఓ అభిప్రాయాన్ని బీజేపీ కల్పించగలిగింది. కీలకమైన పోలీసు శాఖలో బీజేపీ నేతలు తమ ప్రభావాన్ని చూపగలిగారంటే అది చిన్న విషయం కాదని రాజకీయవర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.

ఎందుకిలా..
పోలీస్ అంటే కనిపించని నాలుగో సింహం.. కష్టపడి ఐపీఎస్ కొలువు సాధించిన వారు కూడా తెలంగాణలో అధికార పార్టీ నేతలకు గులాంగిరీ చేయాల్సిన పరిస్థితి. స్వేచ్ఛగా విధులు నిర్వహించుకోలేని పరిస్థితి. విచారణలో వాస్తవాలు బయటపెట్టలేని దుస్థితి. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందంటారు. ఏళ్ల తరబడి ఊడిగం చేయించుకోవడం, విధి నిర్వహణలో స్వేచ్ఛ లేకపోవడంతో పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు గులాబీ నీడ నుంచి బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రతిపక్షాలకు ప్రభుత్వ వైఫల్యాలపై లీకులు అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఐదు రోజుల వరకూ అందరూ సైలెంట్‌గా ఉన్నారు. కానీ పోలీస్ శాఖ నుంచి అందిన లీకేజీతోనే బీజేపీ దానిని తనకు అనుకూలంగా మార్పుకుని రాజకీయంగా లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార పార్టీ అరచకాలు ఆగకపోతే రాబోయే రోజుల్లో మిగత శాఖల్లోనూ ఇలాంటి పరిస్థితి తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:BJP- Jagan: జగన్‌తో దోస్తీ ముప్పేనా? ఆర్కే భాష్యంలో ఆంతర్యం ఆదెనా?
[…] […]