TS Police Jobs: తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఊరట లభించనుంది. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూసిన కళ్లు ఇక ఉద్యోగ సాధన కోసమే తాపత్రయ పడుతున్నాయి. పుస్తకాలతో కుస్తీ పట్టి మరీ ఉద్యోగం సంపాదించాలనే ఆశలో ఉన్నారు. ప్రభుత్వం ఇన్నాళ్లూ ఊరిస్తూ ఉడిచించిన ఉద్యోగాల ప్రకటన ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. దీంతో నిరుద్యోగులు వేయి కళ్లతో తమ కలలు సాకారం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇంకా సమయం పట్టే అవకాశాలున్నాయి. టెట్ నిర్వహించి ఆ తరువాత భర్తీ ప్రక్రియ చేపడతారు. అందుకే టీచర్ల భర్తీ ఆలస్యం కానుంది. ఇక ప్రస్తుతం మాత్రం కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాత్రం విడుదలైంది. దీంతో నిరుద్యోగులకు ఏదో ఒక ఆశ మాత్రం దొరికినట్లు అయింది. 16, 614 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు మే నెల 22లోగా చేసుకోవాలి. ఇందులో 16,027 కానిస్టేబుల్ కాగా 587 ఎస్సై పోస్టులున్నాయి.
Also Read: TRS Plenary Food Menu: కేసీఆర్ విందు ఇస్తే ఇలాగుంటది
లక్షలాది మంది దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్నారు. ఇందులో భాగంగానే జాబ్ ఎలాగైనా కొట్టాలనే తాపత్రయంతో ఉన్నారు. కొన్ని నెలలుగా ప్రిపేర్ అవుతున్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇక ఉపేక్షించేది లేదని చూస్తున్నారు. జాబ్ కొట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.
అర్హతలు గల అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సంసిద్ధులవుతున్నారు. మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉండటంతో అన్ని చోట్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధం కానున్నారు. ఎట్టకేలకు విడుదల అయిన నోటిఫికేషన్ తో తమ అదృష్టం పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ పోస్టుకు పదో తరగతి అర్హత కాగా ఎస్సై ఉద్యోగానికి ఇంటర్మీడియట్ ఉండాలి. దీంతో అందరు అభ్యర్థులు తమ తెలివితేటలకు పదును పెట్టి ఉద్యోగం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read:Ruia Hospital: దేవుడా..! ఆస్పత్రిలో ఘోరం.. పసివాడి ప్రాణం పోయినా కనికరించరా..?