TRS Plenary Food Menu: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంా నిర్వహించనుంది. ఈ మేరకు మాదాపూర్ లోని హెచ్ ఐసీసీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే అతిథుల కోసం బహిరంగ సభ, భోజన ఏర్పాట్లు పూర్తి చేశారు. నోరూరించే వంటకాలు సిద్ధం చేశారు. 33 రకాల వంటకాలతో అతిథులు వారెవ్వా అనేలా విందు ఏర్పాట్లు ఉన్నాయి. ప్లీనరీని అంగరంగ వైభవంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే ప్లీనరీలో పలు తీర్మానాలు చేస్తారని వార్తలు వస్తున్నాయి.
టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ నిర్వహించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచించారు. అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు రానుండటంతో నగరం అంతా గులాబీమయం కానుంది. చుట్టుపక్కల ప్రాంతాలు పార్టీ జెండాలతో ముస్తాబయ్యాయి. ఎటు చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. దీంతో నగరం మొత్తం గులాబీ శోభితంగా మారిపోయింది. ప్లీనరీకి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నోరూరించే వంటకాలు సిద్ధం చేస్తున్నారు. దీంతో భోజన ప్రియులకు మాత్రం జిహ్వ చాపల్యం చూపాల్సిందే.
హెచ్ఐసీసీలో ఉదయం 11 గంటలకు అమరవీరుల స్తూపానికి నివళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దాదాపు మూడు వేల మందికి ఆహ్వానాలు ఉన్నాయి. బార్ కోడ్ తో కూడిన పాసులను జారీ చేశారు. దీంతో ఇందులో 11 అంశాలతో కూడిన తీర్మానాలు ఉంటాయని తెలుస్తోంది. వీటిని కేసీఆర్ ప్రవేశపెట్టి ఆమోదించేందుకుకు అందరి సమ్మతి అడుగుతారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. భవిష్యత్ లో ఎన్నికలు సమీప్తుండటంతో పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రజాకర్షక పథకాల అమలుకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రేపు జరగబోయే ప్లీనరీలో కేసీఆర్ పలు రకాల ప్రకటనలు చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శాఖాహారాలతో పాటు మాంసాహారాలు అతిథులను ఆకట్టుకోనున్నాయి. కేసీఆర్ చూడ్డానికి పక్కపలుచని వ్యక్తి అయినా భోజన ప్రియుడే. దీంతో వచ్చే వారందరికి నోరూరించే వంటకాలు సిద్ధం చేయించారు. దీంతో వచ్చిన వారు లొట్టలేసుకుని తినడమే తరువాయి.
Also Read:Ruia Hospital: దేవుడా..! ఆస్పత్రిలో ఘోరం.. పసివాడి ప్రాణం పోయినా కనికరించరా..?