Homeజాతీయ వార్తలుTelangana Police Recruitment: పోలీస్ నియామకాల్లోనూ అవకతవకలేనా? టీఎస్ పీఎస్సీ ఇక మారదా?

Telangana Police Recruitment: పోలీస్ నియామకాల్లోనూ అవకతవకలేనా? టీఎస్ పీఎస్సీ ఇక మారదా?

Telangana Police Recruitment: టీఎస్ పీఎస్సీ చేస్తున్న వరుస తప్పిదాలు తెలంగాణ ప్రతిష్టను మంటగలుగుతున్నాయి. నిరుద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. నిధులు, నీళ్ళ, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నియామకాలు గాలిలో దీపం లాగా మారుతున్నాయి. సంవత్సరాలకు సంవత్సరాలు శిక్షణ తీసుకున్న అభ్యర్థుల ఆశలను అడియాసలు చేస్తున్నాయి. మొన్న గ్రూప్ _1, నిన్న ఏఈ, నేడు తాజాగా పోలీస్ Telangana Police Recruitment: టీఎస్ పీఎస్సీ చేస్తున్న వరుస తప్పిదాలు తెలంగాణ ప్రతిష్టను మంటగలుగుతున్నాయి. నిరుద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. నిధులు, నీళ్ళ, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నియామకాలు గాలిలో దీపం లాగా మారుతున్నాయి. ఉద్యోగాల భర్తీ.. ఎటు చూసుకున్నా కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కనీసం బోర్డు ను ప్రక్షాళన చేయాలనే సోయి ప్రభుత్వానికి లేకపోవడంతో నిరుద్యోగుల భవిత గాలిలో దీపమవుతోంది..

ఏజ్ బార్ అయినా..

ఇక మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఒక కొలిక్కి రాలేదు. ఇది ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయి. ఇంతవరకు ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రధారులు అనే విషయాన్ని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చలేకపోతోంది. దీంతో అసలు ఈ కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో అంతు పట్టకుండా ఉంది. ఇక దీనిని మర్చిపోకముందే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన పోలీసు ఉద్యోగాల భర్తీ కూడా లోప భూయిష్టంగానే ఉందని తెలుస్తోంది. హైటెక్‌ పద్ధతుల్లో కానిస్టేబుల్‌, ఎస్సై రిక్రూట్‌మెంట్లు చేపడుతున్నామని ఊదరగొట్టిన తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామక బోర్డు కీలకమైన వయసు విషయంలో పప్పులో కాలేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా దేశంలోని ఉద్యోగ నియామక కమిషన్లు, బోర్డులు అన్నీ నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్దిష్ట వయోపరిమితి దాటిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు వీల్లేకుండా రిజెక్టు చేసేలా ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ను ‘సెట్‌’ చేయగా, తెలంగాణ పోలీస్‌ బోర్డు ఆ మౌలిక అంశాన్ని మరచిపోయింది. ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకొనేందుకు బోర్డు సాఫ్ట్‌వేర్‌ అనుమతించింది. దాంతో వయో పరిమితి దాటిన వాళ్లు కూడా వేల
మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో వందల సంఖ్యలో ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, తుది పరీక్ష దాటుకొని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ వరకు వచ్చారు. అన్ని దశల్లోనూ ఏజ్‌ బార్‌ అయిన వీరిని గుడ్డిగా అనుమతించారు. చివరకు సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌కు కూడా పిలిచి, మీరు అర్హులు కాదంటూ తిరస్కరించి పంపారు. వీరిలో డజన్ల సంఖ్యలో అభ్యర్థులు తమకు ఉద్యోగం పొందే స్థాయి మార్కులు వచ్చాయని, బోర్డుపై కోర్టుకు వెళతామని సవాల్‌ చేస్తున్నారు.

ఏడాదికాలంగా సాగుతోంది

ఏడాది కాలానికిపైగా సాగుతున్న పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసె్‌సలో అడుగడుగునా హైటెక్‌ విధానాలు అవలంబిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. మాజీ ఐపీఎస్‌ అధికారుల అభ్యంతరాలను పక్కన పెట్టింది. చివరకు అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో కూడా మానవ జోక్యం లేకుండా జాగ్రత్త పడుతున్నామని చెప్పి పోలీస్‌ నియామక బోర్డు హైటెక్‌ పరికరాలను వినియోగించింది. ఇంతాచేసి, అభ్యర్థి వయస్సు మీరితే దరఖాస్తు దశలోనే ఫిల్టర్‌ చేసి పక్కన బెట్టాలనే కనీస విషయాన్ని పక్కన పెట్టింది. నియామక ప్రక్రియను కోర్టుల్లో చిక్కుకొనేలా చేసింది. వాస్తవానికి తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ సహా ఇతర పోటీ పరీక్షలకు నిర్ణీత వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు రిజక్ట్‌ అవుతుంది. పోలీస్‌ నియామక బోర్డు వయస్సు ఎక్కువ ఉన్న అభ్యర్ధుల దరఖాస్తుల్ని స్వీకరించడం ఇప్పుడు వందలమంది అభ్యర్ధులకు ఇబ్బందికరంగా మారింది. దరఖాస్తుల పేరుతో అభ్యర్ధుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసేందుకే రిజక్ట్‌ ఆప్షన్‌ను ఉపయోగించలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కొంతమంది అభ్యర్ధులు నోటిఫికేషన్‌లోని అన్ని అంశాల్ని పూర్తిగా తెలుసుకోకపోవడం, మరికొందరు ప్రభుత్వం వయో పరిమితిపై మరింత సడలింపు ఇస్తుందేమోనన్న ఆశతో వయసు మీరినా దరఖాస్తు చేసుకున్నారు. నిర్ణీత వయస్సు కంటే కొన్ని రోజులు, నెలలు ఎక్కువగా ఉన్న వారు వేలమంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వారిలో వందల మంది మాత్రమే తుది రాత పరీక్షలో అర్హత సాధించి మెరిట్‌ లిస్ట్‌ వరకు వచ్చారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో వయస్సు ఎక్కువగా ఉందని వారిని తిరస్కరించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏడాది పాటు పోలీస్‌ కొలువు కోసం కలలు కనేందుకు, కష్టపడి పోటీ పడేందుకు అనుమతించి, చివరి దశలో తిరస్కరించడమేంటని ప్రశ్నిస్తున్నారు.
దరఖాస్తు సమయంలోనే బోర్డు తమను తిరస్కరించాల్సిందని తప్పుబడుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular